ఇటీవల మహిళలను రక్షణ రంగంలోకి తీసుకుంటున్నట్టు కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటి వరకు విప్ లకు పురుషులను మాత్రమే రక్షణగా పెట్టడం చూస్తున్నాం. కానీ, ఇక నుండి మహిళా రక్షణ దళాలు కూడా విప్ లకు రక్షణ కల్పించనున్నాయి. తాజాగా కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ ఈ మేరకు ఓ నిర్ణయం ప్రకటించింది. వీవీఐపీలకు పురుషుల మాదిరే ఇక మీదట మహిళలను  కూడా రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు ఇప్పటికే తర్ఫీదు పొంది ఉన్న 33 మంది మహిళా సిబ్బందిని ఎంపిక చేశారు.  

వీరికి మరో పది వారలు శిక్షణ అనంతరం ఆయా వీవీఐపీ లకు రక్షణగా నియమిస్తారని తెలిపారు. ఇలా ఎంపికైన వారికి ప్రత్యేకంగా ఏకే 47 రైఫిళ్లు వాడకం సహా అనేక రక్షణ చర్యలపై శిక్షణ ఇస్తున్నారు. కేంద్రం రక్షణ రంగంలోకి మహిళలను అనుమతించిన అతి కొద్ది కాలంలో వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ శిక్షణ తీసుకుంటున్న 33 మందిలో ఆరుగురు మాత్రమే ప్రయోగాత్మకంగా వీవీఐపీ లకు రక్షణ కు నియమిస్తారు. అనంతరం అవసరాన్ని బట్టి ఈ సంఖ్యను పెంచుకుంటూ పోనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా పార్టీలలోని మహిళా వీవీఐపీ లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. హోమ్ మంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వంటి తదితరులకు ఇప్పటికే సి.ఆర్.పి.ఎఫ్ దళాల సభ్యులు విధులలో ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే మహిళలు తమకు ఇచ్చిన ప్రతి బాధ్యతను నెరవేర్చుకుంటూ, తాము ఎందులోనూ పురుషులకు తీసిపోమని నిరూపించుకుంటూనే ఉన్నారు. తాజాగా కేంద్ర బలగాలలో మహిళలకు చోటు లభించడంతో ఇక వాళ్లకు దాదాపు అన్ని చోట్ల ప్రాధాన్యం లభించినట్టే అంటున్నారు విశ్లేషకులు. తాజాగా ప్రభుత్వం నియమిస్తున్న వీవీఐపీ రక్షణ బాధ్యతలు కూడా మహిళా దళాలు చక్కగా నిర్వర్తించగలవని ఆయా సంఘాలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మహిళలకు సమన ప్రాధాన్యత ఇస్తుండటంపై ప్రస్తుత ప్రభుత్వంపై ఆయా వర్గాల నుండి ప్రశంసల జల్లు కురుస్తుంది. అయితే ఇది అమలు చేయడంలో కూడా అంతే దూకుడుగా ఉండాలని వీరు ఆశిస్తున్నారు. కేవలం పలానా పని కోసమే అని కాకుండా అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తేనే వారిలో ఉత్తమ ప్రతిభ బయటకు రాగలదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: