రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి ఎన్నిక‌లు వ‌చ్చినా..  క‌మ్యూనిస్టులు ప్ర‌ధాన టాపిక్‌గా మార‌తారు. అప్ప‌టి వ‌ర‌కు వారు ఉద్య‌మాలు చేస్తారు.. ప్ర‌జ‌ల కోసం పోరాడ‌తారు.. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డ‌తారు. కానీ.. ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి మాత్రం ఏదో ఒక పార్టీ వెనుక న‌డుస్తార‌నే పేరును సొంతం చేసుకున్నారు రాష్ట్ర క‌మ్యూనిస్టు పార్టీ పెద్ద‌లు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో.. ఒంట‌రిగా పోరాటం చేసిన‌.. క‌మ్యూనిస్టులు.. జీరో అయిపోయారు. నిజానికి రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించిన సీపీఎం పుంజుకుంటుంద‌ని.. ఒక్క‌స్థాన‌మైనా గెలుచుకుంటుంద‌ని.. ఉత్త‌రాంధ్ర వంటి.. క‌మ్యూనిస్టు ప్రాబ‌ల్యం ఉన్న ప్రాంతాల్లో గెలుస్తుంద‌ని అనుకున్నారు.

కానీ, సీపీఎం , సీపీఐలు రెండూ కూడా చ‌తికిల ప‌డ్డాయి. 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి .. ముంద‌స్తుగానే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినా.. ఎక్క‌డా ఒక్క స్థానంలోనూ గౌర‌వ ప్ర‌ద‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకోలేక పోయారు. ఇక‌, జ‌న‌సేన బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం తో.. బ‌య‌ట‌కు వ‌చ్చిన సీపీఐ.. సీపీఎంలు.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. సీపీఐ ప‌రోక్షంగా.. ప్ర‌త్యక్షంగా టీడీపీకిమ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక‌, సీపీఎం.. ప‌రోక్షంగా అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న బ‌లంగా ఉంది.

ఈ నేప‌థ్యంలో ఎవ‌రు ఎటు వైపు మొగ్గు చూపుతారు? అనేది ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. వైసీపీని చూసుకుంటే.. సీపీఎం ప‌ట్ల సానుభూతి ఉన్న‌ప్ప‌టికీ.. పిలిచి పిల్ల‌నిచ్చే ప‌రిస్థితి లేదు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీపీఎంతో పొత్తు పెట్టుకుని.. టికెట్లు ఇచ్చే అవకాశం ఎట్టిప‌రిస్థితిలోనూ లేదు. ఇక‌, టీడీపీ వైపు మొగ్గుతారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, సీపీఐ విష‌యానికి వ‌స్తే.. టీడీపీతో పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంది. అయితే.. రెండుకు మించిన స్థానాలు టీడీపీ కూడా ఇచ్చే ప‌రిస్థితి లేదు.

సో.. దీనిని బ‌ట్టి.. సీపీఐ ప‌రిస్థితి ఒకింత ఆశాజ‌నంగా ఉన్న‌ప్ప‌టికీ.. సీపీఎం ప‌రిస్థితి మాత్రం ఎటూ కాకుండా పోయే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రోవైపు.. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుందామ‌ని అనుకున్నా.. ఆ పార్టీ బీజేపీతో ఉన్నంత వ‌రకు సీపీఎం అటు చూసే ప‌రిస్థితి లేదు. దీంతో ఒంట‌రి పోరు త‌ప్పే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: