ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి  తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. సమ్మె కాలం నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ కోలు కోవడం లేదు. దీనికితోడు  కరోణ వైరస్ అనేది మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు అనే విధంగా  తయారైపోయింది. కనీసం కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మన ఆర్టీసీ చేరుకున్నది అంటే  అది ఏ పొజిషన్ లో నడుస్తుందో తెలుస్తోంది. ఆర్టీసీ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోవడానికి కారణం ఏమిటి..?  తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎందుకు మొండి చేయి చూపిస్తూ వస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు  జీతాలు లేక  అనేక ఇబ్బందులు పడుతూ తమ ఉద్యోగాలను చేస్తున్నారు.

దీనికి తోడు ఆర్టీసీ  ఎన్నో నష్టాలలో నడుస్తుంది అని చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ జోన్, బస్ భవన్  లోని ఆర్టీసీ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు. 17వ తేదీ దాటినా ఇప్పటికీ జీతాలు ఖాతాల్లో పడకపోవడంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 24 వేల మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. రెండు నెలలుగా కార్మికులకు జోన్ల వారీగా జీతాలు చెల్లిస్తున్నారు. ఎవరికి ఎప్పుడుజీతం ఖాతాలో పడుతుందో అర్థం కావట్లేదు కొన్ని జోన్లకు ఈ నెల 13,14 తేదీల్లో జీతాలు వేశారు. గ్రేటర్ హైదరాబాద్, బస్ భవన్ ఉద్యోగులకు మాత్రం 17వ తేదీ దాటిన చెల్లించలేదు.

 జీతాల విషయాన్ని అధికారులు మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ దృష్టికి తీసుకు వెళ్లారా..లేదా అనే విషయం ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల్లో చర్చనీయాంశంగా  ఉంది. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని ఎండీగా బాధ్యతలు తీసుకునే సమయంలో సజ్జనార్ చెప్పిన విషయం తెలిసిందే. కార్మికులు పిల్లల చదువులు,వ్యక్తిగత, గృహ రుణాల చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల కొత్త రుణాలు పుట్టే పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎండి సజ్జనార్ జోక్యం చేసుకొని జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: