అగ్ర‌రాజ్యం  అమెరికా ద‌ళాలు అఫ్గ‌న్‌ను విడిచి వెళ్లిన త‌రువాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తాలిబ‌న్ రాజ్యం త‌మ షరియా చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తోంది. మ‌హిళ‌ల‌పై క‌ఠిన త‌ర నిబంధ‌నలు అమ‌లు చేస్తోంది. అలాగే తాలిబ‌న్‌ల రాక‌తో అఫ్గ‌న్ ఆర్థిక ప‌రిస్థితి అత‌లా కుత‌ల‌మ‌యింది.. ప్ర‌జ‌ల జీవ‌న విధానం దెబ్బ‌తిన్న‌ది ఈ క్ర‌మంలోనే ఆక‌లి కేక‌లు మిన్నంటాయి. తిన‌డానికి తిండి లేక ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు.  పెద్ద‌ల‌యితే ఆక‌లిని త‌ట్టుకుంటారు కానీ, పిల్లల ప‌రిస్థితి ఏంటి..?  దీంతో త‌మ పిల్ల‌ల‌కు తిండి పెట్ట‌డం కోసం త‌ల్లిదండ్రులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న వ‌స్తువుల‌ను త‌క్కువ ధ‌ర‌కు అమ్ముతున్నారు. 


దీని ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో త‌మ పిల్ల‌ల‌కు ఆహారం పెడుతున్నారు. అలాగే విలువైన వ‌స్తువుల‌ను త‌క్కువ ధ‌ర‌కే అమ్మేస్తున్నారు. 25 వేల అఫ్గానీల‌కు కొన్న ఫ్రిడ్జ్‌ను కేవ‌లం 5 వేల అఫ్గనీల‌కు అమ్మాన‌ని ఓ బాధితుడు మీడియా ముందు త‌న గోడు వెల్ల‌బోసుకున్నాడు.   తాలిబ‌న్ పాల‌న‌లో అఫ్గ‌న్ ముందుకు దూసుకువెళ్తుంద‌ని, గ‌తంలో లాగా కాకుండా తాము మారామ‌ని చెప్పుకొచ్చిన తాలిబ‌న్ ఉగ్ర‌వాదుల మాట‌లు గాలి మాట‌లే అని తేలిపోతోంది.


 ప్ర‌జ‌ల‌ను భ‌యం గుప్పిట్లోపెట్టి తమ‌కు అనుకూలాంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో  అఫ్గ‌నిస్తాన్‌లో జ‌రిగిన రాకెట్ దాడి పెద్ద‌గా భ‌య‌ట‌కు రాలేదు.  నిన్న కాబూల్‌లోని ప‌వ‌ర్ ప్లాంట్ జ‌రిగిన దాడి ఐఎస్ఐఎస్- కే దాడులు జ‌రిపినట్టు అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డించింది. ఈ ఐఎస్ఐఎస్ - కే ఉగ్ర‌వాద సంస్థ‌కు హ‌క్కాని ద్వారానే డ‌బ్బులు వెళ్లాయి. అలాగే అఫ్గ‌న్‌ను త‌మ కబంధ హ‌స్తాల్లో కి తీసుకున్న హ‌క్కానీ తాలిబ‌న్ ప్ర‌భుత్వంలో కీలకంగా ఉన్నాడు. ఇక్క‌డ ఉంటూనే దాడి చేస్తారు.


   విష‌యం ఏమిటంటే ప‌వ‌ర్‌ప్లాంట్ పై దాడి చేస్తే అక్క‌డి ప్ర‌జ‌ల‌కు విద్యుత్ ఉండ‌దు, ఇంట‌ర్ నెట్ ఉండ‌దు.  దీంతో అక్క‌డి ప్ర‌జ‌లకు వ‌స‌తులు ఉండ‌వు. ఈ కార‌ణంగా తాలిబ‌న్‌లు చెప్పిన‌ట్టు వింటారు అనేది వారి ప్లాన్‌. దీని ద్వారా మ‌ళ్లీ అఫ్గ‌నిస్తాన్ పాత చీక‌టి రోజుల్లోకి వెళ్లి ప్ర‌జ‌లు త‌మ‌కు బానిస‌లుగా మార‌ల‌న్న‌దే తాలిబ‌న్‌ల కుట్ర‌.






మరింత సమాచారం తెలుసుకోండి: