ఒక‌ప్పుడు వైసీపీ లో క్రియాశీల‌కంగా ఉన్న‌వారంతా త‌రువాత స్త‌బ్దుగా ఉండిపోయారు. త‌మ ప‌ద‌విని నిల‌బెట్టుకునే క్ర‌మంలో కొంద‌రు ఉన్నా అది కూడా తాత్కాలిక‌మే అని తేలిపోయింది.రెండున్న‌రేళ్ల త‌రువాత కొత్త క్యాబినెట్ రూప‌క‌ల్ప‌న‌కు జ‌గ‌న్ చేస్తు న్న ప్ర‌య‌త్నాలు ద‌స‌రా త‌రువాత ఓ కొలిక్కి రానున్నాయి. దీంతో కొత్త ముఖాల‌కు, ముఖ్యుల‌కు కేబినెట్ లో బెర్తులు ఖ‌రారు కానున్నాయి. కానీ రోజాకు ఆ ఛాన్స్ లేక‌పోయినా, అయ్య‌న్న విష‌య‌మై స్పందించారు. పూర్వ ప్ర‌భు భ‌క్తిని ప్ర‌ద‌ర్శించి, అధిష్టానం ద‌గ్గ‌ర మార్కులు కొట్టేశారు. మిగిలిన మంత్రుల క‌న్నా తీవ్రంగానే స్పందించారు. ప‌నిలో ప‌నిగా త‌న పాత కోపం ఒక‌టి వ్య‌క్తీక‌రించి టీడీపీపై సెటైర్లు వేశారు. కామెంట్లు పాస్ చేశారు. ఇవ‌న్నీ రానున్న కాలంలో రోజాను ఆదుకుంటాయో లేదో అన్న‌ది మాత్రం తేల‌ని విష‌యం.



ఇంకా చెప్పాలంటే.........
ఎన్నిక‌ల్లో ప్ర‌భు భ‌క్తిని ప్ర‌ద‌ర్శించి త‌రువాత మ‌రిచిపోయే వారు ఉంటారు. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ అధికారంలోకి రావాల‌న్న ధ్యా స‌తో ప్ర‌భు భ‌క్తి చూపించేవారు ఉంటారు. ఈ కోవలో కొంద‌రు నాయ‌కులు జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఉన్నారు. మ‌హిళా నేత‌లు కూడా ఉన్నారు.ఆ రోజు చంద్ర‌బాబుపై అసెంబ్లీ వేదిక‌గా యుద్ధం చేసిన రోజా త‌రువాత సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా జ‌గ‌న్ కు అండగా ఫ్లోర్ లో నిలిచి, ఎన్నో సార్లు స‌స్పెండ్ అయిన రోజా త‌రువాత కాలంలోనూ పార్టీకి అండ‌గానే ఉన్నారు. స‌భ లోప‌ల‌, వెలుప‌ల ఒకే విధం గా పార్టీకి మ‌ద్ద‌తుగా ఉన్నారు. అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ ఆమెను ప‌ట్టించుకోలేదు. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నూ లేదు. దీంతో ఒక్క సారిగా ఆమెలో నిరాశ ఆవహించింది.



ఏపీఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌వి అప్ప‌గించినా అది కూడా ఆమెకు పెద్ద‌గా క‌లిసిరాలేదు. త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆమెకు చోటుం దున్న గ్యారెంటీ కూడా లేదు. అయిన‌ప్ప‌టికీ ఆమె పాత పంథాలో వెళ్తున్నారు. అయ్య‌న్న జ‌గ‌న్ పై చేసిన వ్యాఖ్య‌లు త‌గ‌వ‌ని, అది అవ‌త‌లి వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాన‌ని చెప్పారు. తిరుప‌తి వెంక‌న్న‌ను ద‌ర్శించిన అనం త‌రం ఆమె మీడియాతో మాట్లాడు తూ ముఖ్య‌మంత్రి ఎలా ఉండాలో జ‌గ‌న్ ను చూసి నేర్చుకోవాల‌ని అన్నారు. చంద్ర‌బాబు మొద లుకుని అయ్య‌న్న వ‌రకూ టీడీపీ ముఖ్య‌నేత‌లంద‌రిపైనా ఆమె విమ‌ర్శ‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap