దాయాది దేశం పాక్ ఆవిర్భావం నుండి భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది. స్వాతంత్రం ప్రకటించే సమయానికి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ విభజించు పాలించు అనే సూత్రాన్ని ఈ రెండు దేశాల మధ్య చక్కగా వినియోగించి వెళ్లారు. అప్పటి నుండి పాక్ భారత్ పై నిప్పులు చెరుగుతూనే ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక గాయం చేస్తూనే ఉంది. కేవలం భారత్ పై పోరాడటానికి తన భూభాగంపై తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తూనే ఉంది. తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడుతున్నప్పటికీ తన పగని మాత్రం పెంచిపోషిస్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో దాడులు, ఎంతో రక్తపాతం.. చెప్పుకుంటూ పోతే దానికి అంతు కూడా ఉండదేమో అన్ని చేసింది.

తాజాగా దీనికి చైనా తోడైంది. వీరిద్దరూ కలిసి కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అయినా భారత్ సంయమనం పాటిస్తూనే ఉంది. ఎన్ని చేస్తున్నా తాజాగా చైనా సాయంతో ఆఫ్ఘన్ ను ముష్కరులు ఆక్రమించడానికి పన్నాగం వేయడం, విజయం సాధించడం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజులలో భారత్ పై మరింతగా పగ తీర్చుకోడానికి మాత్రమే పాక్ చేస్తుంది. పాక్ లో ఒక పక్క తీవ్రమైన సంక్షోభం ఉంది, కరోనా తరువాత ఇది మరింతగా పెరిగింది. కరోనా సమయంలో చైనా పై ప్రపంచ ద్రుష్టి సారించడం పెరిగిపోయిందని, దాని కార్యకలాపాలు అన్నీ పాక్ కు మార్చేసుకుంది. ఎవరు ఎన్ని చేస్తున్నా భారత్ మాత్రం తన భద్రతా ఏర్పాట్లు మరింత జాగర్తగా చూసుకుంటూ తన జాగర్తలో తాను ఉంది.

ఆఫ్ఘన్ ఆక్రమణ ద్వారా విపరీతంగా స్లీపర్ సెల్స్ ను భారత్ లో ఏర్పాటు చేసి ఆత్మాహుతి దాడులను తీవ్రతరం చేయాలనీ పాక్-చైనా కుట్రలు. మరో పక్క సరిహద్దులలో కూడా వీలైనంత రగడకు సిద్ధం అయ్యాయి. ఈ రెండిటిని గమనిస్తూనే ఉన్న భారత్ ఎప్పటి కప్పుడు శత్రువులకు తగ్గట్టుగా ఆయుధాగారాన్ని పెంచుకుంటూ అటు సరిహద్దులను, ఇటు బలమైన ఇంటలిజెన్స్ ద్వారా సరిహద్దు లోపల ముష్కరుల ఆటలు సాగకుండా జాగర్తలు పడుతుంది. ప్రపంచం అంతా సంక్షోభంలో ఉన్న ఈ తరుణంలో కూడా ఇటువంటి రాక్షస కార్యకలాపాలను రెచ్చగొడుతున్న దేశాలను ప్రపంచ పటంలో లేకుండా చేయడం చాలా అవసరం. కానీ ఈ సంక్షోభంలో యుద్ధం వరకు వెళితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వెనక్కు నెట్టగలదనే ఉద్దేశ్యం మాత్రమే తప్ప మరొకటి కాదు. కానీ, ఈ రాక్షసుల మనసు మాత్రం రక్తపాతాన్ని కోరుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: