తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర రాజ‌న్ కు మ‌ధ్య కాస్త గ్యాప్ పెరిగిందని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 17 న తెలంగాణ‌కు స్వాతంత్య్రం వ‌చ్చిన రోజు . తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం దాని గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. అధికారికంగా తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని నిర్వ‌హించాల‌నే డిమాండ్ ను ప‌క్క‌కు పెడుతోంది. మౌనంగానే ఉంటోంది.


 ఇలాంటి సంద‌ర్భంలో రాష్ట్ర ప్ర‌థ‌మ పౌరురాలు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర రాజ‌న్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకోవాల‌ని పిలుపునిచ్చింది. తెలంగాణ కోసం వీరోచితంగా పోరాడిన వారికి నివాళుల‌ర్పించాల‌ని సూచించింది.  అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్రం విమోచ‌న దినోత్స‌వం అధికారంగా నిర్వ‌హించ‌డంపై స్పందించ‌కున్నా రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న త‌మిళ‌సై  విమోచ‌న దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకోవాల‌ని అసాధార‌ణ రీతిలో పిలుపినివ్వ‌డం తెలంగాణ వ్యాప్తంగా చర్చ‌కు తెర‌లేపింది.


సెప్టెంబ‌ర్ 17 ను విమోచ‌న దినంగా  అధికారికంగా నిర్వ‌హించాల‌ని బీజేపీ ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తోంది. కానీ టీఆర్ఎస్ మాత్రం మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకే ఈ అంశాన్ని బీజేపీ లేవ‌నెత్తుతోంద‌ని టీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తు ఆ విష‌యంపై స్పందించ‌డం లేదు.  ఈ క్ర‌మంలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర రాజ‌న్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విమోచ‌న దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.


 అలాగే మొన్న‌టికి మొన్న ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టుకు పాడి కౌశిక్ రెడ్డి పేరును సిఫార‌సు చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సైకి లేఖ రాసింది. దీని పై గ‌వ‌ర్న‌ర్ స్పందిస్తూ ప్ర‌జ‌ల‌కు సేవ చేసిన వారికి మాత్ర‌మే నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వాల‌ని సూచించారు. అలాగే కౌవిక్ రెడ్డిపై క్రిమిన‌ల్ కేసులు కూడా ఉన్న‌ట్టు ఆమె దృష్టికి రావ‌డంతో పాడి కౌశిక్ రెడ్డి ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ రెండు విష‌యాలతో సీఎం కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సైకి ప‌డ‌డం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.



 

మరింత సమాచారం తెలుసుకోండి: