జీఎస్టీ కౌన్సిల్ తాజగా మరోసారి సమావేశం అవడంపై రాష్ట్రాలు ఆసక్తిగా చూశాయి. ఈ సారి కౌన్సిల్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనేది వారి ఆసక్తి. ప్రజలకు కూడా దీనిపై కాస్త ఉత్సాహం లేకపోలేదు. దీనిపైన ఈసారి జీఎస్టీ తగ్గిస్తారు, దీనిపై ఎక్కువ చేస్తారు అనేది వాళ్ళ ఆసక్తి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. అందరు ఎదురుచూస్తున్నట్టు పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలో చేర్చడం జరగలేదు. సరికదా, వాటి ధరలు కూడా రోజువారీ పెరిగినవి తప్ప తగ్గలేదు. అలాగే కరోనా సమయంలో మందులకు జీఎస్టీ మినహాయించారు. దానికి కొనసాగింపుగా ఈ కౌన్సిల్ లో కూడా డిసెంబర్ 31, 2021 వరకు ఈ మినహాయింపు పొడిగించారు.

ఈ నిర్ణయం తో ఇంకొంత కాలం కరోనా మందులు తక్కువ ధరలకు లభించగలవు. ఇక ఫుడ్ డెలివరీ యాప్స్ అయినటువంటి జొమాటో, స్విగ్గి ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే వారికి మాత్రం కాస్త పిరం కానున్నాయి. తాజా జీఎస్టీ కౌన్సిల్ ఈ యాప్స్ పై జీఎస్టీ 5 శాతానికి పెంచారు. జనవరి నుండి ఈ కొత్త జీఎస్టీ అమలులోకి వస్తుంది. ఇక ఐస్ క్రీం పై 18 శాతం జీఎస్టీ; రైల్వే విడిభాగాలు, లోకో మోటివ్ పై జీఎస్టీ 12 నుండి 18 కి పెంచారు.

అలాగే బయో డీజిల్ పై జీఎస్టీ 12 నుండి 5 శాతానికి తగ్గించారు. వికలాంగుల వాహనాలపై కూడా జీఎస్టీ 5 శాతానికి  కుదించారు. ఫోర్టిఫైడ్ రైస్ పై కూడా జీఎస్టీ 18 నుండి 5 శాతానికి తగ్గించారు. ఓడలు, విమానాల ద్వారా మరో ఏడాదిపాటు ఎగుమతులపై జీఎస్టీ ఉండబోదని కౌన్సిల్ స్పష్టం చేసింది. క్యాన్సర్ ఔషదాలపై కూడా 12 శాతంగా ఉన్న జీఎస్టీ ని 5 శాతానికి తగ్గించారు. ఇక రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లింపులలో పెంపును కూడా వాయిదా వేశారు. దీనితో చాలా రాష్ట్రాలకు ఈ కౌన్సిల్ నిర్ణయాలు చేదు నే మిగిల్చాయి. ఈ సారైనా జీఎస్టీ పెంపు జరిగితే తమకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని ఆయా రాష్ట్రాలు కౌన్సిల్ సమావేశంపై ఆశలు పెట్టుకున్నాయి. అయితే అలాంటివి ఏవి జరగకపోవటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: