ఏపీలో గ‌త యేడాదిన్న‌ర కాలంగా వైసీపీ వాళ్లు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోన్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. రేపు ఆదివారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు కౌంటింగ్ ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మ‌ధ్యాహ్నానికే ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఈ ఎన్నిక‌ల‌ను టీడీపీ ముందే బహిష్క‌రించింది. దీంతో ఎన్నిక‌ల్లో వైసీపీ ఏక‌ప‌క్ష విజ‌యం సాధిస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే వైసీపీ ఏక‌గ్రీవంగా కొన్ని జిల్లా పరిష‌త్ ల‌నే కైవ‌సం చేసుకుంది.

రేప‌టి ఫ‌లితాలు కూడా నామ‌మాత్ర‌మే కానున్నాయి. టీడీపీ ముందుగానే చేతులు ఎత్తే య‌డంతో వైసీపీ అన్ని స్థానాలు తామే కైవసం చేసుకుంటామన్న ధీమాలో మాంచి దూకుడు మీద ఉంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఆయా జిల్లాల‌లో కొందరిని జడ్పీ ఛైర్మన్ లుగా జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. గ‌త యేడాదే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే జ‌గ‌న్ కొంద‌రిని జ‌డ్పీ చైర్మ‌న్లు గా ఖ‌రారు చేశారు. ఇప్పుడు వీరికే ఆ ప‌ద‌వులు ఇవ్వ‌నున్నారు.

ఇక పార్టీ కోసం ప‌నిచేసిన వారికే జ‌గ‌న్ ప‌ద‌వులు ఇస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక పార్టీలో ఉంటూ పార్టీకి వెన్ను పోటు పొడిచిన వారిని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశారు.
ఇక జ‌గ‌న్ ఖ‌రారు చేసిన జ‌డ్పీ చైర్మ‌న్ల లిస్టు చూస్తే ఇలా ఉంది.

విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు ( ఈయ‌న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణకు స్వ‌యానా మేన‌ళ్లుడు )
విశాఖపట్నం – శివరత్నం
గుంటూరు – క్రిస్టినా ( ఈమె గ‌తంలో తాడికొండ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవ‌ల వ‌ర‌కు డీసీఎస్ ఎంస్ చైర్మ‌న్‌గా కూడా ప‌నిచేశారు)
ప్రకాశం – బూచేపల్లి వెంకాయమ్మ ( మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డికి త‌ల్లి)
పశ్చిమ గోదావరి – కవురు శ్రీనివాస్ ( పాల‌కొల్లు వైసీపీ ఇన్‌చార్జ్‌, నిన్న‌టి వ‌ర‌కు డీసీసీబీ చైర్మ‌న్‌గా ఉన్నారు)
కడప – ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ( రాజంపేట మాజీ ఎమ్మెల్యే)

 

మరింత సమాచారం తెలుసుకోండి: