రాబోయే ఎన్నికల్లో  మళ్లీ జగన్ గెలుస్తారా లేదా..? దాంట్లో ఏముంది అండి జనం ఓటేస్తే గెలుస్తారు లేకుంటే లేదు అనుకుంటున్నారు కదూ.. అలాగే చంద్రబాబు గెలుస్తారా లేదా ఆయన కూడా జనం ఓటేస్తే గెలుస్తారు లేదంటే లేదు..? మరియు పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా..? జనం ఓటేస్తే గెలుస్తారు లేదంటే లేదు..? ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే జనం యొక్క ఆశీర్వాదం ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారు. ప్రస్తుతం జగన్ రాజకీయం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం క్యాబినెట్ మీటింగ్ తర్వాత  ఎన్నో రకరకాల ప్రచారాలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇదంతా  వచ్చేటువంటి ఎన్నికల పైనే దృష్టి అని అర్థం చేసుకోవచ్చు. కానీ జగన్  ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారని చెప్పవచ్చు.

 అవి ఏంటంటే ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ ఈ ముగ్గురి కులాల ఓటు బ్యాంకు అయితే డిస్ట్రబ్ కాకుండా చూసుకోవడం. ఇప్పటివరకు అయితే ఆ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉన్నది. అయితే ఎస్సీ, ఎస్టీ మైనారిటీ  ఓట్లు దాదాపు కోటిన్నర వరకు ఉన్నాయని చెప్పవచ్చు. రెండవ పాయింట్  సంక్షేమ పథకాలు అందుకునే అటువంటి పేదలు వివిధ వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, ప్రజలు. అయితే వీరంతా కోటిన్నరలో ఉండగా మిగిలిన కాపు, బిసి ఇతరులు కలిసి 50 లక్షల వరకు ఉండవచ్చు. వీరంతా కలిసి దాదాపు రెండు కోట్ల వరకు  ఉండవచ్చు అని అనుకుందాం. వీరందరితో కలిసి దాదాపు కోటి మందికి పైగా ఓట్లు తప్పకుండా ఉంటాయి.  ఇందులో  గతంలో ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తులు దాదాపు  20 నుంచి 30 % పోతుంది అనుకోండి.

అంటే ఇంకా 60 నుంచి 70 శాతం మంది  మిగిలి ఉంటారు. అదేవిధంగా బీసీలు ఒక్కసారి ఓటు వేసిన వాళ్ళలో మళ్లీ కొంతమంది తగ్గిపోవచ్చు. అలాగే ఇందులో నుంచి ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఇందులో మిగిలిన అటువంటి ఓట్లు  బి సి, ఎస్ టి, మైనారిటీ ఓట్లు ఇందులో పక్కాగా సంక్షేమ పథకాలను అందుకున్నవారు ఉంటారు. ఈ విధంగా జగన్ సర్కార్  వ్యూహాత్మకంగా  వచ్చేటువంటి ఎన్నికలపై  ముందుగానే దృష్టిసారించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: