ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓ విష‌యంలో  మెచ్చుకోవ‌చ్చు. ఎవ‌రికి అయినా ఆయ‌న మాట ఇచ్చారంటే మాట నిలుపుకునే విష‌యంలో ఆయ‌న నూటికి నూరు శాతం నిల‌బ‌డ‌తారు. జ‌గ‌న్ త‌న తండ్రి దివంగ‌త వైఎస్సా ర్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని క‌రెక్టుగా పుణికి పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చాలా మంది సీనియ‌ర్ల‌కు ప‌ద‌వులు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. కొంద‌రు నేత‌ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలోనే పార్టీ అధికారంలోకి వ‌చ్చాక వారికి ప‌ద‌వులు ఇస్తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో క‌వురు శ్రీనివాస్‌కు సైతం హామీ ఇచ్చారు. క‌వురు శ్రీనివాస్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆచంట నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

అయితే చివ‌ర్లో ప్ర‌స్తుత మంత్రి చెరుకువాడ రంగ‌నాథ రాజు రావ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న కోసం క‌వురు శ్రీనివాస్ ను ప‌క్క‌న పెట్టారు. జ‌గ‌న్ చెప్పిన వెంట‌నే క‌వురు శ్రీను త‌న టిక్కెట్ వ‌దులుకున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే నామినేటెడ్ ప‌ద‌వుల పంపిణీలో భాగంగా క‌వురు శ్రీనును ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా డీసీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. అలాగే పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్ ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టారు.

ఇక ఇప్పుడు పశ్చిమ గోదావ‌రి జిల్లా జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి బీసీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో ఆ ప‌ద‌వి కోసం ఎంతో మంది పోటీలో ఉన్న‌ప్ప‌ట‌కి కూడా క‌వురు శ్రీనుకే ఇస్తున్నారు. జ‌గ‌న్ శ్రీను శ్రీన‌న్నా అని పిలుస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే క‌వురు శ్రీను య‌ల‌మంచిలి నుంచి జ‌డ్పీటీసీగా పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపుతో పాటు జిల్లాలో వైసీపీ నుంచి పోటీ చేసిన నేత‌ల అంద‌రి గెలుపు లాంఛ‌న‌మే కానుంది. సో రేపు ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జ‌డ్పీ చైర్మ‌న్‌గా క‌వురు శ్రీను ఏక‌గ్రీవం కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: