రెండు రోజుల క్రితం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన విమర్శలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యల దెబ్బకు టీడీపీ నేతలు కవర్ చేసుకోలేక సతమవుతున్నారు. తాజాగా ఏపీ పోలీస్ అధికారులు సంఘం దీనిపై స్పందించింది. జనుకుల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... కోడెల శివప్రసాద్ సంతాప సభలో అయ్యన్న పాత్రుడు పోలీస్ అధికారులపై మాట్లాడిన మాటలు ఖండిస్తున్నాం అని అన్నారు ఆయన. గతంలో గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న మీరు పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారు అని ఆరోపణలు చేసారు.

భవిష్యత్తులో మీకు అలాంటి పదవులు ఇవ్వకూడదని కోరుతున్నాం అని వ్యాఖ్యానించారు ఆయన. నా కొడకల్లారా అని మాట్లాడుతున్నారు ,మేము మా భాషలో మాట్లాడితే మీరు తట్టుకోలేరు అంటూ ఘాటు కామెంట్స్ చేసారు. అలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు ఆయన. పోలీస్ వ్యవస్థ ఎంత కఠినతరమైనదో మీకు తెలుసు, అన్యాయం జరిగితే న్యాయస్థానాలు ఆశ్రయించండి అని ఆయన సూచించారు. రాజ్యాంగ హక్కులు మాకు లేవా, మీకేనా హక్కులు ఉన్నది అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఉపాధ్యక్షురాలు నాగిని మాట్లాడుతూ... ఒక సామాన్య ప్రజలను తిట్టినట్టు ఐపిఎస్ అధికారులను తిట్టడం సరికాదు అన్నారు నాగిని.  ఉన్నత చదువులు చదువుకున్న వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, కింది స్థాయి వాళ్ళని ఇంకెల మాట్లాడతారో అంటూ కామెంట్ చేసారు. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పై ఉంది అని అన్నారు. అయ్యన్న పాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని నాగిని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. అలాగే సంఘం సభ్యులు సోమయ్య మాట్లాడుతూ... చంద్రబాబు ఏ రోజు పోలీస్ లను ఒక మాట కూడా అనలేదు అన్నారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి అని వ్యాఖ్యలు చేసారు. చట్ట సభల్లో కూర్చుని మీరు ఇలాంటి వ్యాఖ్యలు తగదు,మీ మాటలను వెనక్కి తీసుకోవాలిఅని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: