తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 ఊహించని రీతిలో ముగిసింది. ఒకే రోజు రెండు భారీ సభలు జరగడంతో రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తెలంగాణ విమోచన దినం పేరిట బిజెపి సభ జరిగితే సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దళిత,గిరిజన దండోరా పేరిట  సభ నిర్వహించింది. ఈ రెండింటిలో కాంగ్రెస్ సభకే ప్రజలు భారీగా వచ్చినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమిత్ షా  స్వయంగా పాలుపంచుకున్న ప్పటికీ బిజెపి సభ, కాంగ్రెస్ స్థాయిలో లేదన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి బీజేపీ సభకు అమిత్ షా వస్తుంటే, కాంగ్రెస్ సభకు రాహుల్ గాంధీని రప్పించేందుకు కాంగ్రెస్ నాయకులు తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. అయితే రాహుల్ గాంధీ ఎందుకో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నిక ఈ రాజకీయ వేడికి కారణమని చెప్పవచ్చు. హుజురాబాద్ బరిలో ప్రధానంగా బిజెపి, టిఆర్ఎస్ ల మద్యే పోటీ ఉందన్న వాదనలు వినిపిస్తున్నా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నిక అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అక్కడ ముక్కోణపు పోటి తప్పదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రేవంత్ కు కీలక పదవితో కాంగ్రెస్ లో ఇటీవల కాలంలో ఎన్నడూ కనిపించనంత జోష్ కనిపిస్తుంది. అదే హవాను ఇలాగే కొనసాగించేందుకే నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న రేవంత్ దళిత, గిరిజన దండోరా పేరిట పలు ప్రాంతాల్లో సభ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం దళిత గిరిజన దండోరా ముగింపు సభకు సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లో సభ నిర్వహించాడు. కేంద్ర హోంమంత్రి గానే కాకుండా బిజెపిలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత అత్యంత కీలక నేతగా వ్యవహరిస్తున్న అమిత్ షా వస్తున్నారనగానే బిజెపి రాష్ట్ర నేతలు భారీ ఎత్తున జన సమీకరణ చేసే దిశగా సాగారు.

అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల  మీదే పార్టీ నేతలు దృష్టి పెట్టడం, ఓవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మరోవైపు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లు పాదయాత్రలో నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి వెంట తిరగడమే పార్టీ  పార్టీ కేడర్ కు తలకుమించిన భారంగా కనిపిస్తోంది. అయితే అమిత్ షా వచ్చిన నేపథ్యంలో మీడియా అంతా బీజేపీ సభ పై  దృష్టి సారించ గా, దీంతో నేతలు భారీగా తరలి రావడం కాంగ్రెస్ సభ ఎక్కువగా విజయవంతమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: