నిర్మల్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో  మొత్తం ఈటల రాజేందర్  సెంటర్ అఫ్ అట్రాక్షన్ గానే జరిగిందని చెప్పవచ్చు. అమీషా వేదికపైకి వచ్చినప్పటి నుంచి తన యొక్క ఉపన్యాసాన్ని ముగించే వరకు ఈటల రాజేందర్ ను పలకరిస్తూనే ఉన్నారు. ఈటలను అమీషా పిలిచినప్పుడల్లా జనాల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అమిత్ షా మాట్లాడుతున్నంత సేపు పలుమార్లు రాజేంద్ర పేరును ప్రస్తావిస్తూ తన స్పీచ్ ఇచ్చాడు. ఆయన సభా వేదికపైకి రాగానే ఈటల రాజేందర్ ను ప్రత్యేకంగా వేదికపైకి పిలిచారు అమిత్ షా.

 అక్కడి నేతలతో పాటు కూర్చున్నా ఈటల రాజేందర్ ను ముందుకొచ్చి నిలబడాలని, కానీ ఈటెల అక్కడే నిలబడడంతో ముందుకు రండి ఎక్కడ ఎందుకు అక్కడే నిలబెడుతున్నారు అంటూ తనదైన శైలిలో నవ్వులు చిందిస్తూ అమిత్ షా ఈటలను సభా ప్రాంగణం ముందుకి రమ్మన్నారు. ఈటెలకు గట్టిగా చప్పట్లు కొట్టాలని, దీంతో సభ ప్రాంగణమంతా  మారుమోగిపోయింది అని చెప్పవచ్చు. ఈటల వచ్చి నిలబడగానే  అక్కడ ఉన్నటువంటి జనల దగ్గర అరుపులు, కేకలు వేశారు. తర్వాత అమిత్ షా మాట్లాడుతూ హుజురాబాద్ లో గెలిపించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డబ్బుల, కుటుంబ రాజకీయానికి ముగింపు పలకాలనీ పిలుపునిచ్చారు. ప్రతి ఎన్నిక డబ్బులు పెట్టి గెలవాలని టిఆర్ఎస్ భావిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు  కుటుంబ పాలన, డబ్బుల రాజకీయాన్ని  గెలిపిస్తారా, ఈటల రాజేందర్ ను గెలిపిస్తారా అని అక్కడున్న ప్రజలను అడిగారు.

అలాగే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కెసిఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు  గోరి కట్టడం ఖాయమని అన్నారు. యావత్ తెలంగాణ తన వెంటే ఉందని తెలిపారు. హుజురాబాద్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. విమోచన దినం జరుపుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందని, బీజేపీ అధికారంలోకి రాగానే  విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. హుజురాబాద్ గడ్డ మీద పువ్వు గుర్తు గెలవడం ఖాయం అని  దీన్ని ఆపే సత్తా ఎవరికీ ఏమైనా ఉంటే ఆపాలని హెచ్చరించారు ఈటల రాజేందర్. ఈ విధంగా నిర్మల్ సభ నేతల ప్రసంగాలతో దద్దరిల్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: