భవిష్యత్ లో టీకాలను తినేయొచ్చు. అదేంటీ అనుకుంటున్నారా.. లెటూస్ లాంటి మొక్కలను మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ స్టోర్లుగా మార్చే సరికొత్త విధానంపై కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. మెసెంజర్ ఆర్ఎన్ఏ పరిజ్ఞానంతో కొన్ని కరోనా టీకాలు తయారయ్యాయి. వీటిని శీతల ఉష్ణోగ్రతలో ఉంచాలి. మొక్కల్లో టీకా వృద్ధి చేస్తే ఆ అవసరం లేదు. ఒక మొక్క ఒక వ్యక్తికి సరిపడే స్థాయిలో మెసెంజర్ ఆర్ఎన్ఏను ఉత్పత్తి చేయగలదు.

ఇక అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకాను మన దేశంలో బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఉత్పత్తి చేయనుంది. హైదరాబాద్ లోని పలు యూనిట్లలో ఈ టీకాను ఉత్పత్తి చేయడానికి B.Eకి DGCI అనుమతి ఇవ్వగా.. త్వరలోనే ఉత్పత్త ప్రారంభం కానుంది. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ టీకా కరోనాను కరోనాను 85శాతం ఎదుర్కొన్నట్టు క్లినికల్ పరీక్షల్లో తేలింది.

మరోవైపు కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ ఓ నుంచి వెంటనే అత్యవసర గుర్తింపు పొందేందుకు కొన్ని రకాలుగా కృషి చేస్తున్నట్టు భారత్ బయోటెక్ తెలిపింది. ఈ టీకాపై నిర్వహించిన క్లినికల్ పరీక్షల సమాచారాన్ని జులైలో డబ్ల్యూహెచ్ఓ కు అందించామనీ.. వాళ్లు లేవనెత్తిన సందేగాలకు తగిన వివరణలను ఇచ్చామంది. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ ఓ తదుపరి స్పందన కోసం ఎదురు చూస్తున్నామని భారత్ బయోటెక్ తెలిపింది.

ఇక దేశంలో నిన్న రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. నిన్న అర్ధరాత్రి 11గంటల 58నిమిషాల వరకు 2.5కోట్ల మందికి కరోనా టీకాలు వేయగా.. రికార్డు స్థాయిలో జరిగిన వ్యాక్సినేషన్ పట్ల భారతీయుడు గర్వంగా ఉన్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. అయితే చైనా గతంలో ఒకే రోజున 2.47కోట్ల మందికి టీకాలు ఇవ్వగా.. భారత్ 2.5కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చింది. అటు దేశంలో ఇప్పటి వరకు 79.42కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు.






మరింత సమాచారం తెలుసుకోండి: