సవాంగ్ నాయకత్వంలో పని చేస్తున్న పోలీస్ శాఖ భ్రహ్మండంగా పని చేస్తుందని ఓపెన్ డిబేట్ పెట్టండి మీరు రైట్ అని చెబితే మీకు క్షమాపణ చెబుతాను అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. కాదని చెబితే డీజీని పోస్ట్ ను తప్పించి ప్రజలకు క్షమాపణ చెప్పిస్తారా అంటూ ఆయన సవాల్ చేసారు. రెండున్నరేళ్లుగా వైసీపీ నాయకులు ఏపీ పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడితే స్పందించని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ ఇప్పుడెందుకు స్పందించారు?  అని ఈ సందర్భంగా నిలదీశారు.

బొంగు పోలీసులు,  కొజ్జా పోలీసులు, నా కాళ్లు పట్టుకొని పోస్టింగ్ లోకి వచ్చావు, నీ ఎస్పీని, డీజీని పిలిచి నా ముందు నిలబెడతా, పోలీసులు కుక్కల్లా పని చేశారని వైసీపీ దేశంలోనే అత్యున్నత ఖ్యాతి గడించిన ఏపీ పోలీస్ శాఖను తిడుతుంటే మీరెందుకు స్పందించలేదు? అని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. అధికారపార్టీ నాయకులు ఏమన్నా పర్వాలేదు. కాని ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం ఏమీ అనకూడదని ఏమన్నా ఉందా?  అంటూ నిలదీశారు. చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే ఆయన ఇంటి గేట్లకు తాళ్లు తెచ్చి కట్టారు అని...

ఇది ఏ రాజ్యాంగంలో ఉంది అని ఆయన నిలదీశారు. ఎవరి మెప్పు కోసం పని చేశారు. అప్పుడెందుకు స్పందించలేదు? అంటూ ఆయన ప్రశ్నించారు. విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనకు అనుమతి తీసుకొని వెళితే విశాఖ విమానశ్రయంలోనే వైసీపీ గూండాలు ఆపితే మీ పోలీసులు చంద్రబాబు నాయుడును వెనక్కి వెళ్లిపొమ్మని అన్నారు అని ఆయన కామెంట్స్ చేసారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద చెప్పులు, కర్రలు విసిరితే  ఆర్టికల్ 19 కింద ప్రజా స్వేచ్ఛని డీజీ ప్రజలందరికి జ్ఞానోదయం కలిగించారు అని అన్నారు రామయ్య.  మీరెందుకు ఆయనను ప్రశ్నించలేదు?  అని ఈ సందర్భంగా నిలదీశారు. మేము అధికారపార్టీ తొత్తులమని చాలా మంది పోలీసులు బహిరంగంగా చెబుతున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడును చంపడానికి వచ్చిన వారీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: