మా నాన్నకు భారత రత్న ఇవ్వండి
లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, గత ఏడాది దివంగతులైన మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు భారత రత్న ప్రధాన చేయాలని అతని కుమారుడు చిరాక్ పాశ్వాన్ ప్రధాన మంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన నరేంద్ర మోడీకి, బీహార్  ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తన తండ్రి భారత రత్న బిరుదుకు అర్హుడని ఆయన  పేర్కొన్నారు. తన తండ్రి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కూడా ఆవేశంగా కోరారు. దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ తొలి వర్ధంతి ని శని వారం బీహార్ లోని పలు ప్రాంతాలలో నిర్వహించారు.
 లోక్ జన శక్తి పార్టీ జాతీయ కార్యవర్గం శనివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఐదు దశాబ్దాల పాటు రామ్ విలాస్ పాశ్వాన్  వివిధ హోదాల్లో దేశానికి ఎనలేని సేవ చేశారని, ఆరుగురు ప్రధాన మంత్రుల వద్ద మంత్రిత్వం నెరిపారని   ఆ తీర్మానంలో పేర్కొన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాక్ పాశ్వాన్  తమ పార్టీ తీర్మానాన్ని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి పంపారు.
చిరాక్ పాశ్వాన్ డిమాండ్ చేయడటం వెనుక ఒక కారణం ఉంది. ప్రధాని నరేంద్ర మోడి  లోక్ జనశ క్తి పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడి గురించి, ఆయన సేవల గురించి అతని ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రస్తుతించారు. రామ్ విలాస్ పాశ్వాాన్ తనకుమంచి మిత్రుడని, దేశాభివృద్ధిలో అతనిది కీలక పాత్ర అని చెప్పారు. ఆయన  బీహార్ రాష్ట్ర ప్రజలగొంతుక అని కూడా తన సంతాప తీర్మానంలో పేర్కొన్నారు.
అదే సమయంలో చిరాక్ పాశ్వాన్ బీహార్ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. తన తండ్రి ప్రథమ వర్థంతి కార్యక్రమాల్లో  సి.ఎం. నితిష్ కుమార్ పాల్గొనక పోవడం ఏంటని ప్రశ్నించారు. గత అసెంబ్లి ఎన్నికల్లో జె.డి (యు)కు వ్యతిరేకంగా చిరాక్ పాశ్వాన్ అన్ని చోట్ల అబ్యర్దులను బరిలో నిలిపారు.  ఈ కారణంగా నితిష్ కుమార్  పార్టీ నేతలు పలువురు పరాజయం పాలయ్యారు. కాగ్ రామ్ విలాస్ పాశ్వాన్ పేరును భారత రత్న బిరుదురు ప్రతిపాదించాలనిు బీహార్ లోని పలువురు నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బి.జె.పి నేతలు సుశీలు కుమార్ మోడీ,  ప్రవీడ్ కుమార్ ఆర్.జె.డి నేత తేజస్వీ యాదవ్ తదతరులు రామ్ విలాస్ పాశ్వాన్ కు బారత రత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: