వైసీపీ ఏపీలో అధికారంలో ఉంది. రెండున్నరేళ్లకు పాలన దగ్గర పడుతోంది. ఇక ఏపీలో వైసీపీని ఢీ కొట్టే పార్టీగా టీడీపీ ఉంది. పాలన అయినా ప్రతిపక్షం అయినా టీడీపీకి కొత్త కాదు, పైగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆద్వర్యంలోని పార్టీ అది.

అన్ని విధాలుగా రాటుదేలిన టీడీపీ విపక్షంలో ఉంటూనే వైసీపీని బాగా ఇబ్బంది పెడుతోంది. తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లు అయితే అధికారంలో ఉన్నది ఎవరు అన్న డౌట్లు రాక మానవు. ఇక ఏపీలోనే కాదు, విశాఖ జిల్లాలో కూడా వైసీపీకి టీడీపీ కొరకరాని కొయ్య అయింది. టీడీపీకి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన పవర్ ఏంటో  అధికార పార్టీ నేతలకు  చూపిస్తూ వస్తున్నారు.

ఆయన ప్రతీ రోజూ వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ప్రభుత్వం మీద విమర్సలు చేస్తూ ఉంటారు. ఆయన మాటల దూకుడు చాలా జోరుగా ఉంటుంది. ఆయన మాట్లాడితే కౌంటర్ చేయడానికి కూడా వైసీపీ నేతలు ఎవరూ ముందుకు రారు అంటే అర్ధం చేసుకోవాల్సిందే. అయ్యన్నపాత్రుడు పవర్ ముందు వైసీపీ ఎందుకు తీసికట్టు అవుతుందో కూడా ఆలోచించాల్సిందే. ఇక అయ్యన్నపాత్రుడు విషయం తీసుకుంటే ఆయన ఎక్కడా వెనక్కు తగ్గరు, ఆయన తో పెట్టుకోవడం ఎందుకు అనే రకం నేతలు వైసీపీలో ఉన్నారు. విశాఖ జిల్లాకు ఏకైక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ స్మూత్ గానే ఉంటారు. ప్రత్యేకించి ఆయన పొలిటికల్ కామెంట్స్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు, తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటారు. మిగిలిన వారు కూడా అదే తీరు. ఒక్క నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మాత్రమే అయ్యన్నను కౌంటర్ చేస్తూంటారు. అయితే అది సరిపోవడంలేదు. ఇపుడు అయ్యన్న ఏకంగా గుంటూరు నుంచే భారీ సౌండ్ చేశారు. దాంతో వైసీపీ మొత్తం అలెర్ట్ కావాల్సి వచ్చింది. ఏది ఏమైనా అయ్యన జోరు ముందు విశాఖ టీడీపీ నేతలు తగ్గిపోతున్నారు అనే విశ్లేషణ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: