రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా కూడా కుర్చీ మీదనే ఆశ ఉంటుంది. ముందు ఎమ్మెల్యే కావాలి. ఆ తరువాత అర్జంటుగా మంత్రి అయిపోవాలి. ఇదే ట్రెండ్ ఇపుడు పాలిటిక్స్ లో సాగుతోంది. మంత్రి పదవి కోసం రాజకీయ నాయకులు ఎదురు చూస్తూనే ఉంటారు.

ఇక వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో కొంతమందికి మొదటి విడతలో జగన్ మంత్రి పదవి ఇచ్చారు. మరి కొంతమందికి రెండున్నరేళ్ల తరువాత మంత్రి వర్గ విస్తరణలో ఛాన్స్  ఉంటుంది అని జగన్ నాడు చెప్పారు. ఇపుడు ఆ సమయం దగ్గర పడుతోంది. దాంతో మంత్రి పదవుల కోసం రేసులో ఉన్న వారు అంతా గంపెడాశలు పెట్టుకున్నారు.

అయితే వీరంతా జగన్ దృష్టిలో పడేందుకు తమ వంతు ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. అయితే అందరి కంటే ముందున్నారు ఈ విషయంలో క్రిష్ణా జిల్లా ఎమ్మెల్యే జోగి రమేష్. ఆయన ఏకంగా చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్ళి నిరసన అంటూ హడావుడి చేశారు. అయ్యన్నపాత్రుడు అన్న మాటలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నది జోగి రమేష్ డిమాండ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన జగన్ దృష్టిలో బాగా పడ్డారు అంటున్నారు. అంతే కాదు ఏపీలో కూడా ఫోకస్ అయ్యారని చెబుతున్నారు.

ఇక జోగి రమేష్ కి మంత్రి వర్గంలో బెర్త్ ఖాయమని కూడా అంటున్నారు. దీంతో మిగిలిన ఆశావహులలో కూడా వేడి రాజుకుంటోంది. తాము కూడా ఇలాగే చేస్తేనే తప్ప జగన్ దృష్టిలో పడమా అన్న కొత్త ఆలోచనలు కూడా వారిలో వస్తున్నాయి అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలోని టీడీపీ నేతలు, మాజీ మంత్రుల ఇళ్ళ ముట్టడి తో రాష్ట్ర రాజకీయం అంతా కూడా గందరగోళంగా మారుతుంది అంటున్నారు. మరి ఇలా అగ్రెస్సివ్ మూడ్ లో రాజకీయాలు చేసేవారికే పదవులు అంటూ కనుక వైసీపీ పెద్దలు కొలమానం పెడితే మాత్రం చాలా మంది ఇదే రూట్ లోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. మొత్తానికి జోర్గి రమేష్ మంత్రి రేసులో ఉన్న వారికి గురువుగా మారారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp