విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన బొత్స త్వ‌ర‌లో రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నారు. వినేందుకు కాస్త ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇదే నిజం. ఐదు జిల్లాల‌ను ప్రభావితం చేయ‌గ‌ల స‌మ‌ర్థ నేత బొత్స ఇప్పుడు డైలామాలో ఉన్నారు. సొంతంగా పార్టీ పెట్టేందుకు స‌త్తా లేక‌, జ‌గ‌న్ ను ఎదుర్కోలేక అవ‌స్థ పడుత‌న్నారు. ఈ నేప‌థ్యంలో బొత్స ప్ర‌యాణం ఎటువైపు?

స‌మైక్య రాష్ట్రంలోనూ, విభ‌జ‌న ఆంధ్రాలోనూ మంచి పేరున్న నాయ‌కుడు బొత్స స‌త్స‌నారాయ‌ణ‌. ఆ రోజు రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాం లో భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను నిర్వ‌హించారు. ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో  మున్సిప‌ల్ శాఖ బాధ్య‌త‌లు చూస్తున్నారు. ఆ రోజు నుంచి నిన్న‌టి ఎన్నిక‌ల వ‌ర‌కూ త‌న హ‌వాకు ఎదురేలేద‌ని నిరూపించారు. మ‌ధ్య‌లో కొన్ని వ‌ర్గ‌ రాజ‌కీయాలు కూడా చేశార‌న్న‌ది టీడీపీ ఆరోప‌ణ. ఏదేమైన‌ప్ప‌టికీ త‌న అసెంబ్లీ నియోజ‌క‌ వ‌ర్గం (చీపురుప‌ల్లి)తో పాటు గ‌జ‌ప‌తిన‌గ‌రం అసెంబ్లీ స్థానం, నెల్లిమ‌ర్ల , ఎస్ కోట అసెంబ్లీ స్థానాల‌తో పాటు, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట్ స్థానంపైనా ఎన‌లేని ప‌ట్టు సాధించి, త‌నకంటూ ఓ వ‌ర్గాన్ని త‌యారు చే సుకున్నారు. ఇం త‌గా విజ‌యన‌గ‌రం రాజ‌కీయాల‌ను ప్రభావితం చేసిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో స‌రైన గుర్తింపు లే క అవ‌స్థ ప‌డుతున్నారు. దీంతో రాజ‌కీయాల‌కు దూరం కావాల‌నుకుంటున్నారు. ముఖ్యంగా సీనియ‌ర్ల‌కు జ‌గ‌న్ విలువ ఇవ్వ‌క‌పో వ‌డంతో తరుచూ ఆయ‌న ఇబ్బం ది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో కుమారుడు సందీప్ ను బ‌రిలోకి దింపి తాను ప‌క్క‌కు త‌ప్పు కోవాల‌ని భావిస్తున్నారు. త‌మ్ముడు గ‌జ‌ప‌తి న‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్ప‌ ల న‌ర్స‌య్య, అదేవిధంగా శృంగ‌వ‌ర‌పు కోట ఎమ్మెల్యే క‌డుబండి శ్రీ‌నివాస‌రావు,  నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల నాయుడు, వీరితో పాటు విజ‌య‌నగ‌రం ఎంపీగా బెల్లాన చంద్రశే ఖర్ ఇలా వీరంతా బొత్స సాయంతోనూ, ఊతంతోనూ గెలిచి వ‌చ్చిన వారే! కానీ ఎవ‌రు ఎన్ని చెప్పినా ఎవ‌రి మాట విన‌ని జ‌గ‌న్ చాలా రోజుల నుంచి బొత్సతో స‌త్సం బంధాలు కొన‌సాగించ‌లేకపోతున్నారు. దీంతో ఆయ‌న చాలా రోజుల నుంచి పూర్తిగా సైలెంట్ అ యిపోయారు.


రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ఫోక్స్ వ్యాగ‌న్ కుంభ‌కోణంలోనూ, ఇంకా పలు కేసుల్లోనూ బొత్స పేరు వినిపించిన‌ప్ప‌టికీ త‌రువాత కా లంలో ఆ కేసుల‌న్నీ పెద్ద‌గా ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని ప్ర‌భావితం చేయ‌లేక‌పోయాయి. స‌మైక్యాంధ్ర ఉద్య‌మాన్ని అణిచివేసి అ ప‌ఖ్యాతి ద‌క్కించుకున్న ఆయ‌న కాల‌క్ర‌మంలో ఓ ఐదేళ్ల పాటు సైలెంట్ అయిపోయారు. 2014 ఎన్నిక‌లు బొత్స కుటుంబానికి క‌లి సిరాలే దు. ఆయ‌న భార్య బొత్స ఝాన్సి కూడా రాజ‌కీయాల్లోనే ఉన్నారు అప్ప‌టికీ. కానీ ఒక సారి ఆమె విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెం ట్ నియోజకవ‌ర్గంకు ఎన్నిక‌య్యాక త‌రువాత కాలంలో పూర్తిగా ఇంటికే ప‌రిమితం అయిపోయారు. కాల‌గ‌తిలో బొత్స ఝాన్సి క్రి యాశీల‌క రాజ‌కీయాల‌కు దూరం అయ్యారు. కుటుంబ రాజకీయాలకు ఎంతో  పేరున్న విజ‌య‌న‌గ‌రంలో ఎన‌లేని ప్రాభవం ఉన్న లీడ‌ర్ గా పేరున్న‌ప్ప‌టికీ ఈ ద‌ఫా ఆయ‌న పెద్ద‌గా జిల్లా రాజకీయాల్లో త‌న ముద్ర చూపించ‌లేక‌పోయారు. త‌న సొంత సామాజిక వ‌ర్గం అయిన కాపు సామాజిక‌వ‌ర్గంకు కూడా ఏమీ చేయ‌లేక‌పోయారు. ఇవ‌న్నీ ఆయ‌న అసంతృప్తికి కార‌ణాలు.పైకి చెప్ప‌క‌పో యినా అశోక్ గ‌జ‌ప‌తి రాజు కుటుంబానికి ఆయ‌న స‌న్నిహితుడు. మాన్సా స్ ట్ర‌స్ట్ పై వివాదాలు రేగిన‌ప్పుడు కూడా ఆయ‌న పె ద్ద‌గా మాట్లాడ‌లేదు. అక్క‌డ ఎప్ప‌టి నుంచో విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌కూ, బొత్సకూ విభేదాలు ఉన్నాయి.  ఇవ‌న్నీ మొన్న టి ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపాయి కూ డా! అయిన‌ప్ప‌టికీ బొత్స కోల‌గ‌ట్ల విజ‌యాన్ని నిలువ‌రించ‌లేక‌పోయారు. ఇవ‌న్నీ ఓ ఎత్తైతే విజ‌య‌న‌గ‌రంలో మునుప‌టిలా ఆయ‌న రాజ‌కీయాలు చెల్లుబాటు కావ‌డం లేదు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎలా అయితే  ఏక స్వామ్య వ్య‌వ‌స్థ ఉందో ఒక‌ప్పుడు బొత్స కూడా జ‌గ‌న్ మాదిరే ఉండేవారు. మాట‌ల‌తో చెల‌రేగిపోయేవారు. కానీ ఇప్పుడు చెల్ల‌వు అందుకే ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరం కావాల‌ని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap