ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పి నేతల మధ్య మాటల యుద్ధం...కాదు బూతుల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది....వరుసపెట్టి నాయకులు తీవ్ర విమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టించారు. అసలు బూతులే కాదు...ఏకంగా దాడులకే టి‌డి‌పి-వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా టి‌డి‌పి నేత అయ్యన్నపాత్రుడు...సి‌ఎం జగన్‌ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

అయ్యన్న తిడితే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్...చంద్రబాబు ఇంటికెళ్ళి బాగా హడావిడి చేశారు. అక్కడ టి‌డి‌పి-వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఇక వైసీపీ నేతలు వరుసపెట్టి చంద్రబాబు, అయ్యన్నలపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రోజా కూడా ఫైర్ అయ్యారు. సి‌ఎం...సినిమా టికెట్లు, మద్యం, మాంసం అమ్మడంపై అయ్యన్న చేసిన విమర్శలకు కౌంటర్లు ఇచ్చారు. చిరంజీవి, నాగార్జున కోరడంతోనే ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లను విక్రయించాలని జగన్ ప్లాన్ చేశారని అన్నారు.

అలాగే బెల్ట్ షాపులని తొలగించారని, చాలావరకు మద్యం దుకాణాలను ఎత్తివేశారని మాట్లాడారు. ఇక అయ్యన్నకు ఎమ్మెల్యే, మంత్రి పదవులు పీకేశారని, చంద్రబాబుకు సీఎం పదవి, లోకేష్ మంత్రి పదవి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను పీకేశారని రోజా ఫైర్ అయ్యారు. అయితే రోజా వ్యాఖ్యలకు టి‌డి‌పి నుంచి కౌంటర్లు వస్తున్నాయి. చిరంజీవి, నాగార్జున మాత్రమే ఇండస్ట్రీలో లేరని, ఇంకా చాలామంది ఉన్నారని, అందరినీ అడిగి అప్పుడు సినిమా టికెట్లు అమ్ముకోవాలని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, 2014లో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చని, ఎవరికి పదవులు శాశ్వతం కాదని, ఇప్పుడు పదవులు ఉన్నాయని గర్వపడితే, రేపు ప్రజలు వాటిని పీకేస్తారని సంగతి రోజా గుర్తుపెట్టుకుంటే బెటర్ అని టి‌డి‌పి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక మద్యం విషయంలో ఏం జరుగుతుందో...మద్యపాన నిషేధం ఎంత చక్కగా అమలవుతుందో ఒకసారి రోజా రాష్ట్ర ప్రజలని అడిగితే బాగుంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: