ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు మళ్ళీ పుంజుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఓటమి పాలైన నేతలు నిదానంగా పికప్ అవుతున్నారు. ముఖ్యంగా జగన్ వేవ్‌లో టి‌డి‌పి కంచుకోటల్లో ఓటమి పాలైన నాయకులు తమదైన శైలిలో కంచుకోటలని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే టి‌డి‌పికి కంచుకోటలుగా ఉన్న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో నేతలు...సైలెంట్‌గా పికప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

అసలు ఈ రెండు నియోజకవర్గాలు టి‌డి‌పికి కంచుకోటలు...టి‌డి‌పి ఆవిర్భావం అంటే 1983 నుంచి చూసుకుంటే 2019 వరకు ఈ నియోజకవర్గాల్లో టి‌డి‌పి మంచి విజయాలు సాధించింది. నందిగామలో టి‌డి‌పి ఏడు సార్లు విజయం సాధించగా, జగ్గయ్యపేటలో 6 సార్లు విజయం సాధించింది. ఇక గత ఎన్నికల్లోనే రెండు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే వైసీపీకి చెక్ పెట్టడానికి ఇక్కడ టి‌డి‌పి నేతలు కూడా బాగానే కష్టపడుతున్నారు.

ఇటు నందిగామలో తంగిరాల సౌమ్య పార్టీ తరుపున పనిచేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్ప, వైసీపీ ఎమ్మెల్యే కొత్తగా చేసే అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో అదే పరిస్తితి....వైసీపీ సీనియర్ ఎమ్మెలే సామినేని ఉదయభాను అంత దూకుడుగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. పథకాల తప్ప జగ్గయ్యపేట ప్రజలకు కొత్తగా ఒరిగేదేమి లేదు.

జగ్గయ్యపేటలో టి‌డి‌పి నేత శ్రీరామ్ తాతయ్య తనదైన శైలిలో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు. టి‌డి‌పి సీనియర్ నాయకుడు, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం సైతం తన సొంత నియోజకవర్గమైన జగ్గయ్యపేటలో టి‌డి‌పిని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రజలపై పన్నుల భారం పెంచడం ఎమ్మెల్యేలకు మైనస్ అవుతుంది. అటు పక్కనే ఉన్న అమరావతి ఇష్యూ కూడా వారికి మైనస్‌గానే ఉంది. దీంతో టి‌డి‌పి నేతలకు బాగా ప్లస్ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp