పాకిస్థాన్ సీఎంతో పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడు న‌వ‌జోత్ సింగ్ సిద్దూకు సంబంధాలు ఉన్నాయంటూ నేడు సీఎంగా రాజీనామా చేసిన అమ‌రీందర్ సింగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాజీనామా అనంత‌రం మీడియాతో మాట్లాడిన అమ‌రీంద‌ర్ సింగ్ సిద్దూపై మండిపడ్డారు. సిద్దూకు పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయ‌ని..పాకిస్థాన్ ఆర్మీ అధికారితో కూడా సంబంధాలున్నాయ‌ని చెప్పారు. పాకిస్తాన్ అధ్య‌క్షుడు ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ అధికారి జావీద్ బ‌జ్వా సిద్దూకు మంచి స్నేహితులు అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఒక‌వేల సిద్దూను సీఎం అభ్య‌ర్థిగా అనుకుంటే తాను వ్య‌తిరేకిస్తాన‌ని అమ‌రీంద‌ర్ చెప్పారు. అత‌డిని సీఎం కుర్చీపై కూర్చోపెడితే దేశ ర‌క్ష‌ణ‌కే ప్ర‌మాదం అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. త్వ‌ర‌లోనే సిద్దూ పొలిటిక‌ల్ కెరీరీ మొత్తం నాశ‌నం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. 

ఇక అమరీంద‌ర్ సింగ్ సిద్దూ పై చేసిన వ్యాఖ్య‌లు పంజాబ్ లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సిద్దూకు పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పడంతో కాంగ్రెస్ లో కూడా ఒక్క‌సారిగా ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. ఈ రోజు సోనియా గాంధీతో మాట్లాడి తన రాజీనామా గురించి చెప్పిన త‌ర‌వాత ఆమె ఐయామ్ స్వారీ అమ‌రీంద‌ర్ అంటూ క్ష‌మాప‌ణ‌లు చెప్పింద‌ని అమ‌రీంద‌ర్ వ్యాక్యానించారు. ఇక అమ‌రీంద‌ర్ సింగ్ బీజేపీలో చేరుతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

దానిపై అమ‌రీంద‌ర్ సింగ్ ను ప్ర‌శ్నించ‌గా తాను ఇప్పుడు ఎవ‌రితో ట‌చ్ లో లేన‌ని కేవ‌లం త‌న రాజీనామా ప‌త్రాన్ని గ‌వ‌ర్న‌ర్ కు స‌మ‌ర్పించాన‌ని అమ‌రీంద‌ర్ సింగ్ చెప్పారు. ఇదిలా ఉండ‌గా పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేయ‌డంతో సీఎం అభ్య‌ర్థిగా ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ముందు వ‌రుస‌లో సునీల్ జాక‌ర్ పేరు వినిపిస్తోంది. అదే విధంగా విజ‌య్ ఇండ‌ర్, అంబికా సోనీ ల పేర్లు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి గానీ లేదంటే రేపు ఉద‌యం గానీ దీనిపై అధిష్టానం తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: