హుజురాబాద్ లో మద్యం దుకాణాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం ఏరులై  పారుతోంది. ప్రతిరోజు కోట్లాది రూపాయల మద్యం  అమ్ముడవుతోంది. దీంతో గ్రామాలలో ప్రతిరోజు పండగ వాతావరణమే తలపిస్తోంది. కొన్ని ఊర్లలో మాత్రం రోజురోజుకు దాదాపు కోటి రూపాయలకు పైగా మద్యం  అమ్ముతోంది. అయితే ప్రస్తుత కాలంలో  ఎన్నికలంటేనే నోటు, ముక్క, చుక్క అనేది తప్పనిసరి అయిపోయింది. ఇవి లేకుండా ఏ ఎన్నిక గాని జరిగే పరిస్థితి లేకుండా పోయింది. అయితే హుజురాబాదులో కూడా ఇది ఎక్కువగా నడుస్తోంది అని చెప్పవచ్చు. రెండు పార్టీల మధ్య  హోరాహోరీ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గత రెండు నెలలుగా నియోజకవర్గములో పార్టీలు  పోటాపోటీగా మద్యాన్ని ఏరులై పారుతోంది.

దీంతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో  ప్రతి రోజు పండుగ వాతావరణమే కనబడుతుంది అని చెప్పవచ్చు. అయితే ఇందులో పండగలు, ఏదైనా ప్రత్యేక రోజుల్లో  ఈ మద్యం అమ్మకాలు అయితే ఇంకా జోరుగా కొనసాగుతున్నాయి. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో  మద్యం కొరకు నాయకులు కార్యకర్తలకు  మాంసం మరియు మద్యం  చిట్టిలు రాసి ఇస్తున్నారు. దీంతో ప్రచారం అయిపోయింది అంటే చాలు నియోజకవర్గ కేంద్రంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు మరియు వైన్ షాపులు, అలాగే బార్లు పూర్తిగా నిండిపోతున్న పరిస్థితి నెలకొంది.

అయితే ఈ నియోజకవర్గంలో గత నెలలోనే  ఎన్నికలు వస్తాయని భావించిన నాయకులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. దీనికొరకు ఆయా పార్టీల నేతలను మండలాల వారీగా ఇంచార్జ్ గా పెట్టి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఇలా రెండు ప్రధాన పార్టీలు పోటాపోటీగా దూసుకుపోతూ  మద్యాన్ని  పోటాపోటీగా లాగేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో  29  మద్యం షాపులు ఉన్నాయి. అయితే ఎన్నికల వేడి మొదలైంది. అప్పటి నుంచి  ఈ యొక్క మద్యం షాపుల్లో  వంద కోట్లకు పైగా మద్యం  అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ రికార్డుల్లో, గత ఏడాది రికార్డు దాటిందని వారంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: