తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్‌ కేసు కలకలం రేపుతోంది.  ఈ డ్రగ్స్‌ కేసు నేపథ్యం లో కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మరియు మంత్రి కేటీఆర్‌ ల మధ్య వివాదం తారా స్థాయికి చేరుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు  పీసీపీ చీప్ రేవంత్‌ రెడ్డి.   మంత్రి కేటీఆర్‌ కు దమ్ముంటే... వైట్ ఛాలెంజ్ స్వీకరించాలని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. '' నేను రక్త నమూనాలు ఇస్తా... కొండా విశ్వేశ్వర రెడ్డీ కి..కేటీఆర్ కి సవాల్ చేస్తున్న. వైట్ ఛాలెంజ్ విసురుతున్న. కేటీఆర్ అందుకు సిద్దమా'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్‌ రెడ్డి. ఏ డాక్టర్‌ దగ్గరికి రమ్మంటే అక్కడి వస్తా...  అక్కడే తన రక్తం పరీక్షల కోసం ఇస్తానని స్పష్టం చేశారు. 

 దీనికి మంత్రి కేటీఆర్‌ సిద్ధమా అని సవాల్‌ విసిరారు రేవంత్‌.  డ్రగ్స్ కేసులో నికు సంబందం లేదు అంటున్న కేటీఆర్...   Ed కి సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు.   వివరాలు ఇవ్వలేం అని కోర్టు కి ఎందుకు చెప్తున్నారని...  మీరెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు రేవంత్‌.   ఎక్సైజ్ శాఖ విచారణ లో రకుల్ ప్రీత్ సింగ్ లేదని... Ed విచారణ కి మాత్రం రకుల్ వచ్చిందని తెలిపారు.   ఎక్సైజ్ విచారణ లో రకుల్ నీ కాపాడినది ఎవరు ..? రాణా..రకుల్ ను ఎవరు కాపాడారు .? అని నిలదీశారు రేవంత్‌ రెడ్డి.  

Trs ఎమ్మెల్యే లు.. నాయకులు నడిపే పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్నారని...   దీనిపై విచారణ చేయడానికి కేటీఆర్ కి ఉన్న ఇబ్బంది ఎంటి..? అని నిలదీశారు రేవంత్‌.   దేశ ద్రోహం..రాజద్రోహం పై సుప్రీం కోర్టు ఏం చెప్పిందని...   కేటీఆర్ రాజు అనుకుంటున్నారు ఏమో అని ఎద్దేవా చేశారు.  రాజద్రోహం కేసు పెట్టి చూడమను..   అయన చదివింది గుంటూరు లో అటు నుండి పునే పోయాడని చురకలు అంటించారు.   పుణె నుండి అమెరికా వెళ్ళిన కేటీఆర్‌ కి తెలంగాణ సంస్కృతి ఏం తెలుసు ?  కేటీఆర్ ప్యారాచుట్ అని విమర్శలు చేశారు.   ఆయనకు తెలంగాణ సంస్కృతి ఏం తెలుసు  ? అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: