బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , రేవంత్ రెడ్డి భాష చూస్తే అసహ్యం వేస్తుందని.. తెలంగాణ ప్రజలు వారిని గమనిస్తున్నారని చురకలు అంటించారు. ఒక దైవ కార్యం కోసం అమిత్ షా ని కలిస్తే రేవంత్ మాట్లాడం సరైనది కాదని... రేవంత్ రెడ్డి నోరు ఆయనకు అనేక ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు రఘునందన్ రావు.  ఇటీవల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విషయం లో నోరూపారేసుకొని పార్టీ కి వివరణ ఇచ్చుకోలేదా..? రేవంత్ రెడ్డి పదవి తెచ్చుకుందే సూటుకేసుల తో అని కాంగ్రెస్ నేతలు చెప్పారు అది నిజం కాదా ... ? అని ప్రశ్నించారు రఘునందన్ రావు.  

సోనియా రాజ్యం అంటే 14 వందల మంది బలితీసుకొనే రాజ్యమా..? 2004 లో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా తెలంగాణ ఇస్తే 14 వందల అమరవీరులు  ప్రాణాలు దక్కేవికదా...? గజ్వెల్ సభ టీఆరెస్ సహకారంతో జరిగిందేమో... అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు రఘునందన్ రావు.  నిన్న మొన్నటి వరకు నర్సారెడ్డి  టీఆరెస్ పార్టీ నుండి కాంగ్రెస్ కు రాలేదా....? కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ని కాంగ్రెస్ కు పంపించి గజ్వెల్ లో సభ పెట్టించారో అనిపిస్తుందని మండిపడ్డారు రఘునందన్ రావు.  నిర్మల్  బీజేపీ సభకు పోటీగా కేసీఆర్ సహకారంతో సీఎం నియోజకవర్గంలో సభ అని అనుమానం మాకు ఉందని.. కాంగ్రెస్ నుండి  గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరలేదా..? అని నియదీశారు రఘునందన్ రావు.  

టీఆరెస్ ...కాంగ్రెస్ ది ఫెవికాల్ బంధం కాదా...? గతంలో టీఆరెస్ తో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ కాదా. ? అని ప్రశ్నించారు రఘునందన్ రావు. మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇద్దరికి  డ్రగ్స్ టెస్టు చేయించాలని.. ఇద్దరికి ఢీల్లిలో ఇండియా గేట్ వద్ద చేయిస్తే దేశ ప్రజలంతా చూస్తారని పేర్కొన్నారు రఘునందన్. డ్రగ్ పరీక్షలకు అయ్యే ఖర్చును తానే భరిస్తాననిన్నారు రఘునందన్. రేవంత్ రెడ్డి.. ముందు నీ మీటింగ్ లకు హాజరుకాని మీ సీనియర్ల సంగతి చూసుకో ? నీ పార్టీలో సమస్యలే పరిష్కరించుకోలేవని చురకలు అంటించారు. ఎవరో వ్యక్తులు ప్రకటనలు ఇచుకుంటే బీజేపీ గిరిజనులను అవమానించింది అంటవా...? తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచనం  దినోత్సవం అధికారిక నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని నిప్పులు చెరిగారు రఘునందన్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: