చైనా ఒక స్థాయికి అభివృద్ధి చెందగానే ప్రపంచాన్ని శాసించడమే ఇక మిగిలింది అనే చందాన ప్రవర్తిస్తుంది. ప్రపంచం తీవ్రవాద దేశంగా ముద్ర వేసిన పాక్ లాంటి దేశాలతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ రోజురోజుకు తన స్థాయిని తానే దిగజార్చుకుంటుంది. కేవలం వ్యాపారం కోసం దిగ్గజ దేశంతో లేనిపోని గొడవలకు పోవడాన్ని చూశాం. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం లాంటి కొత్త మాటలను వినాల్సి వచ్చింది. ఒక స్థాయిలో ఇది ప్రచ్ఛన్న యుద్ధం వరకు వెళ్తుందేమో అని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక భారత్ తో కూడా ఈ దేశానికి సత్సంబంధాలు నెలకొన్నాయని చెప్పడానికి వీలు లేదు. ఎప్పుడు ఎటువైపు నుండి భూ ఆక్రమణ లు చేద్దాం అని ఒకవైపు చూస్తూ మరోవైపు వ్యాపార ఒప్పందాలు చేసుకుంటూ రెండు నాలికల ధోరణిని ప్రదర్శిస్తుంది.

కాస్త అభివృద్ధి చెందగానే చైనా ఈ విధంగా ప్రపంచాన్ని లెక్కచేయకుండా ప్రవర్తించడం లేనిపోని సమస్యలకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం కరోనా లాంటి విషాన్ని కూడా చైనా నే ప్రపంచం మీద కక్కిందని అనేక దేశాల విశ్వాసం. ఇలాంటి పరిస్థితులలో కూడా అధికార దాహంతో ఆఫ్ఘన్ ఆక్రమణ లో తాలిబన్ లకు  ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సాయం అందించి చైనా దిగజారిపోతుందని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పుకుంది. తనకు ఎప్పటికైనా పోటీకి వస్తుందనే భారత్ ను నిలువరించేందుకే ఈ ఆక్రమణ జరిపినట్టు, దీని వెనుక చైనా, పాక్ ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్ని చేస్తూ చైనా తనను తాను ప్రపంచం ముందు గొప్పగా చిత్రించుకోవడానికి ఆయా సామజిక మాధ్యమాలలో కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేసుకోవడం కొసమెరుపు.

సహజంగా వికీ లో ఎడిట్ సదుపాయం ఉంటుంది. దీనిని వెసులుబాటుగా చేసుకొని కొందరు తమ ఇష్టానికి సమాచారాన్ని మార్చేసుకుంటున్నారని దీనిపై తాజాగా జరిగిన విచారణనలో స్పష్టం అయ్యింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఎడిటర్లను అదుపులోకి తీసుకున్నట్టు సదరు అధికారులు తెలిపారు. చైనా తమకు నచ్చిన విధంగా వికీ లో సమాచారాన్ని మార్చేసుకుంటున్నట్టు ఈ విచారణలో వెల్లడైంది. ఇలాంటి చొరబాట్లు భవిష్యత్తుకు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం తమ లక్ష్యాలు సాదించడానికే కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని వారు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: