ఎన్నో నాటకీయ పరిణామాలలో ప్రపంచంలో ముష్కరులకు ఒక దేశం ఏర్పాటు చేయబడింది. కేవలం భారత్ ను దెబ్బతీయడానికే ఇటువంటి ఏర్పాటు జరిగినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో తాలిబన్ రాజ్యం ఏర్పాటు జరిగినప్పుడు కూడా భారత్ లో దాడులు పెరిగిపోయాయి. కరోనా సమయంలో భారత్ ధీటుగా ఎదుర్కోవడం చూసి సహించలేకపోయిన చైనా, పాక్ తదితర దేశాల కుళ్ళు లో నుండి ఈ రాక్షస రచన జరిగింది. అంతే, రాక్షసులకు కావాల్సిన సంపద, ఆయుధాలు చకచకా ఏర్పాటు చేయబడ్డాయి. అమెరికా లాంటి సైన్యం కూడా వెనక్కి వెళ్లాల్సి వచ్చిందంటేనే వారికి ఏ స్థాయిలో సంపద, ఆయుధాలు అందించబడ్డాయో తెలుసుకోవచ్చు. నిజానికి ఆఫ్ఘన్ ఆక్రమణ ఆ ప్రాంతం వారికోసం కాదు, భారత్ ను దెబ్బతీయడానికే ఈ వ్యూహరచన జరిగింది.

ఇవన్నీ నిశ్చితంగా పరిశీలిస్తున్న భారత్ ఎప్పటికి అప్పుడు తగిన జాగర్తలు తీసుకుంటూనే ఉంది. అలాగే ఈ విధంగా తీవ్రవాదులకు ఒక దేశం ఏర్పాటు చేయడం లాంటివి ప్రపంచ శాంతికి చేటు అని చెప్పడానికి మోడీ లాంటి వారు ముందుకు రావడం జరిగింది. మోడీ తన భావజాలం తో  ప్రపంచానికి ఈ పరిస్థితి మంచిది కాదని, ఎటువంటి పరిస్థితులలోను తాలిబన్ దేశాన్ని గుర్తించడం సరికాదని అన్ని దేశాలను ఏకం చేయడంలో సఫలం అయ్యారు. ఆక్రమణ ముందు రష్యా సహా పలు దేశాలు ఆఫ్ఘన్ ఆక్రమణ ను స్వాగతించడానికి సిద్ధం అయ్యారు. కానీ అది చాలా సమస్యలకు దారితీస్తుందని మోడీ ఆయా దేశాలకు స్పష్టం చేశారు. దీనితో రష్యా సహా చాలా దేశాలు వారి తీరు మార్చుకున్నారు.  

మోడీ అధ్యక్షతన వర్చువల్ గా ఆయా దేశాల మధ్య జరిగిన సమావేశంలో కూడా ఇదే స్పష్టం చేశారు. తీవ్రవాద దేశం ఒకటి గుర్తించడం తరువాత అది ఏర్పాటు చేయబడిన కొద్ది కాలంలోనే ప్రపంచంలోని తీవ్రవాదులందరూ ఆ స్థలంలో సేద తిరుతున్నట్టు అనేక నిఘా సంస్థలు ఇప్పటికే హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇవన్నీ గమనించాలని మోడీ ఆయా దేశాలకు చెప్పడంలో విజయం సాధించారనే చెప్పాలి. అయితే తీవ్రవాదంతో స్నేహం తమకు చేటు చేయక మానదు అని  చైనా, పాక్ లకు కూడా మోడీ భావజాలం ఉంది. కానీ అలాంటి వారికి ఆ మాటలు అర్ధం అవుతాయా అనేది ప్రశ్న. కేవలం రక్తపాతానికి అలవాటు పడిన వారికి లొంగిపోయి వారితో కలిసిపోయాం అనుకోవడం అంత సులభం కాదని పామును పెంచి పోషిస్తే దాని కాటుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని వారు తెలుసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: