ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే క్ర‌మంలో టీడీపీ  వేగం పెంచుతున్న ప్ర‌తిసారీ వైసీపీ వైఖ‌రి కూడా తీవ్ర‌త‌రం అవుతోంది. నిర‌న‌స‌ల పేరిట రోడ్డెక్కితే చాలు అధికార పార్టీ అస్స‌లు స‌హించ‌లేక‌పోతోంది. ముఖ్యంగా క‌రోనా పేరిట నిబంధ‌న‌లు పాటించ‌కుండా వీరంతా జ‌నం మధ్య‌కు వెళ్తున్నార‌న్న అభియోగంతో వైసీపీ రాజ‌కీయం న‌డుపుతోంది. ఇదే స‌మ‌యంలో కొంద‌రి నాయ‌కుల‌ను హౌస్ అరెస్టులు చేయిస్తూ, మ‌రికొంద‌రిపై కేసులు న‌మోదు చేస్తూ క్షేత్ర స్థాయిలో ప్ర‌తిప‌క్ష గొంతుక అన్న‌ది వినిపించ‌కుండా చేయాల‌న్న భావ‌న‌తో వైసీపీ రాజ‌కీయం చేస్తోంది. దీని కార‌ణంగా త‌మ‌కు సానుభూతి పెరుగుతుందే త‌ప్ప, న‌ష్ట‌పోయేది ఏమీ లేద‌ని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. జ‌గ‌న్ మాత్రం అస్స‌లు వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఎవ్వ‌రు రోడ్డెక్కినా ఓర్వ‌లేక‌పోతున్నారు. త‌ప్పుల‌ను ఏక‌రువు పెడితే దిద్దుకోవాలి కానీ అరెస్టులు చేసి ఏం సాధిస్తార‌ని టీడీపీ మండి ప‌డుతోంది. తాజాగా శ్రీ‌కాకుళంలో టీడీపీ నేత‌లకు, పోలీసులకు  మ‌ధ్య ఇలాంటి వివాద‌మే న‌డుస్తోంది. ఆ వివ‌రాలిలా ఉన్నాయి.


శ్రీ‌కాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడిపై కేసు న‌మోదు చేశామ‌ని పాత‌పట్నం పోలీసులు చెబుతున్నారు. ఈ మేర‌కు ఎస్సై అమిర్ అలీ సంబంధిత వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కరోనా నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తూ పాత‌పట్నంలో శుక్ర‌వారం ర్యాలీ నిర్వ‌హిం చ‌డంపై జిల్లా ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మించామ‌ని చెప్పారు. ఎంపీతో పాటు స్థానిక పాత ప‌ట్నం కార్య‌వ‌ర్గం, మాజీ ఎమ్మెల్యే క‌ల‌మ‌ట ర‌మ‌ణ తో స‌హా 77 మందిపై కేసులు న‌మోదు చేశామ‌ని వెల్ల‌డించారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. త‌మ‌పై కేసులు న‌మోదు చేయ‌డాన్ని త‌ప్పుప‌డుతున్నాయి. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు లేని కే సులు, బ‌హిరంగ స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు లేని కేసులు త‌మ వ‌ర‌కూ వ‌చ్చేట‌ప్ప‌టికీ ఎందుకు వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అధికార ప‌క్షం ప్ర‌వ‌ర్తిస్తున్న తీరుపై ప్ర‌జా కోర్టులోనే తేల్చుకుంటామ‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap