పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ మొదలయింది. కొవిడ్‌ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపుకు 209 కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు... ప్రక్రియ సజావుగా పూర్తి చేయడానికి 11,803 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 32,264 సిబ్బందిని నియమించారు. నిరంతర పర్యవేక్షణకు తాడేపల్లి పంచాయతీ రాజ్ కమిషనరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

కమిషనర్‌ కార్యాలయం నుంచి 13 మంది అధికారులు కౌంటింగ్  పర్యవేక్షణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జిల్లా కేంద్రాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న జడ్పీ సీఈఓలు లనుండి వీరికి ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ ఉంటారు. రాష్ట్రంలోని 660 మండలాల్లో పరిషత్‌ ఎన్నికలు జరగాల్సి ఉండగా... వివిధ కారణాల వల్ల 8 మండలాల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన వాటిలో 126 స్థానాలు ఏకగ్రీవం అయినట్టు అధికారులు పేర్కొన్నారు. సుధీర్ఘ ఎన్నికల ప్రక్రియ కారణంగా చనిపోయిన 11 మంది అభ్యర్థుల స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసారు.

మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. వివిధ కారణాల రీత్యా  375 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచింది. పోటీ చేసిన వారిలోను చనిపోయిన  81 మంది అభ్యర్థుల స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. మిగిలిన 7,220 స్థానాలకుగాను 18,782 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఒక ఐఏఎస్‌ అధికారిని అధికారులు నియమించారు.

శ్రీకాకుళంకు కేఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్రవర్తి, విజయనగరంకు కాంతిలాల్‌దండే, విశాఖపట్నంకు ఎండీ ఇంతియాజ్‌, తూర్పుగోదావరికి ఎం.హరి జవహర్‌లాల్‌, పశ్చిమగోదావరికి ఎస్‌.సత్యనారాయణ, కృష్ణాకి డి.మురళీధర్‌రెడ్డి, గుంటూరుకు పి.లక్ష్మి నరసింహం, ప్రకాశంకు సీ హెచ్‌ శ్రీధర్‌, నెల్లూరుకు పి.బసంత్‌కుమార్‌, చిత్తూరుకు వి.చినవీరభద్రుడు, అనంతపురంనకు కె.హర్షవర్థన్‌ని నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap