ఎన్న‌డూ లేనిది వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ పోరు మాత్రం పూర్తిగా త‌గ్గిపోయింది. త‌ప్ప‌దు అని అనుకుంటూనే త‌ప్ప ఎన్నిక‌ల రణ క్షేత్రంలో కూడా దిగ‌డం లేదు. స్థానిక ఎన్నిక‌ల పోరులో ఎక్క‌డా ఆ జోష్ లేదు. పార్టీ కూడా పెద్ద‌గా మార్గ‌దర్శ కాలు ఇవ్వ‌లేదు. వైసీపీ ఏక‌ప‌క్షంగా గెలుపును ఖాయం చేసుకుంటుద‌న్న వాద‌న నిర్ణయం అయిపోయాక ఇంక తాము పోటీచే సినా చేసేదేమీ లేద‌ని తేలిపోయింద‌ని కొంద‌రు టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్త‌న్నారు. ఈ నేప‌థ్యంలో అచ్చెన్న ఇలాకాలోనూ ప రిస్థితి అలానే ఉంది. ఇక్క‌డ దువ్వాడ శ్రీ‌ను త‌న హవాను మ‌రోసారి కొనసాగించేందుకు చూస్తున్నారు. అస‌లు కాలం క‌లిసి వ‌స్తే ఆయ‌న  కుటుంబానికే జెడ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి వ‌రించేది.



కానీ అనూహ్యంగా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి, ఈ రేసు నుంచి త‌ప్పించారు. మ‌రో సారి పాల‌వ‌ల‌స కుటుంబం త‌మ అదృష్టం ప‌రీక్షించుకోవాల‌ని చూస్తోంది. కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఈ కుటుంబం  మొద‌ట నుంచి జ‌గ‌న్ వెనుకే న‌డిచింది. పాల‌వ‌ల‌స రాజశేఖ‌రం రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో జెడ్పీ చైర్మ‌న్ చేయ‌గా, ఈ సారి ఆ కుటుంబం నుంచి ఇద్ద‌రు మ‌హిళ‌లు బ‌రిలో ఉన్నార‌ని తెలుస్తోంది. పాల‌వ‌ల‌స రాజ‌శేఖ‌రం కుమారుడు విక్రాంత్ కు ఇప్ప టికే డీసీసీబీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. దాని ప‌ద‌వీ కాలం కూడా పూర్తయిపోయింది. దీంతో ఈ సారి త‌మ‌కు అధిష్టానం కరుణ ఉంటుం ద‌ని అంటున్నారు పాల‌వ‌ల‌స కుటుంబ స‌భ్యులు.



స్థానిక పోరులో టీడీపీ సారి అస్త్ర స‌న్యాసం చేసింది. పోటీలో దిగ‌కుండానే  మౌనం అయిపోయింది. ఎలానూ ఇవి అధికార పార్టీకి అ నుకూల‌మే కనుక తాము పోటీ చేసినా పెద్దగా ప్ర‌భావ‌మేమీ ఉండ‌ద‌ని భావించింది. కొన్ని చోట్ల నామ‌మాత్ర పోటీకే ప‌రిమితం అ యింది. అధిష్టానం కూడా పెద్ద‌గా వీటిని సీరియ‌స్ గా తీసుకోలేదు. దీంతో ఈ ఎన్నిక‌లలో టీడీపీ ప్ర‌భావం ఏమీ ఉండ‌ద‌ని ముందు గానే తేలిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap