అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ పై పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది కీలక ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌  రాష్ట్ర వ్యాప్తం గా అన్ని చోట్ల  కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం గా కొనసాగుతోందని...    515  జడ్పీటీసీ, 7220  ఎంపీటీసీ  స్థానాల్లో కౌంటింగ్ జరుగు తోందని వెల్లడించారు.  పలు కారణాలతో 6 చోట్ల  బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని..  2 చోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయి, మిగిలిన4 చోట్ల తడిచాయని ఆయన స్పష్టం చేశారు.   

గుంటూరు జిల్లా  తాడికొండ మండలం రావెల, బీజత్ పురం లో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని...  శ్రీకాకుళం జిల్లా లో సొరబుచ్చి మండలం షలాంత్రి లో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నా యన్నారు గోపాల కృష్ణ ద్వివేది.   విశాఖ పట్నం లో ముక్క వారి పాలెం మండలం  తూటిపల్ల, పాపయ్య పాలెం లో బ్యాలెట్లు తడిశా యని స్పష్టం చేశారు గోపాల కృష్ణ ద్వివేది.  బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్ పై స్థానికంగా  కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు పరిశీలించి  నిర్ణయం తీసుకుంటా రన్నారు.  

ఎక్కడై నా రీపోల్ అవసర మనుకుంటే దాని పై ఎస్ ఈ సీ తుది నిర్ణయం తీసు కుంటుందని...  ప్రస్తుతం అన్ని చోట్లా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాం తం గా  జరుగుతోం దని తెలిపారు గోపాల కృష్ణ ద్వివేది.   ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు త్వర లోనే వస్తాయని...   జడ్పీటీసీ ఫలి తాలు సాయంత్రం, రాత్రి  వరకు వస్తుంటాయని ఆయన వెల్లడించారు. కాగా... ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పరిషత్‌ ఎన్ని కల కౌంటింగ్‌ ప్రారంభం అయి న సంగతి విధితమే.  ఇక ఈ ఎన్నికల కౌంటింగ్‌..  ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే ఛాన్స్‌ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: