శ్రీ‌కాకుళం జిల్లాలో జెడ్పీ పీఠంపై అంద‌రి క‌ళ్లూ ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌ద‌వులు పొందిన వారు అవి వ‌ద్ద‌నుకుని మ‌రీ! జెడ్పీ పీఠం ఇవ్వాల‌న్న వాద‌న‌తోనూ ఉన్నారు. కార్పొరేష‌న్ ప‌దవుల‌తో త‌మ‌కేం లాభం లేద‌ని వాపోతున్నారు. ఈ ద‌శ‌లో పాల‌వ‌ల‌స కుటుంబం త‌న‌దైన రాజ‌కీయం చేస్తోంది. కానీ గొర్లె కిర‌ణ్ కూడా అంతే స్పీడులో ఉన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న త‌న వ‌ర్గానికే ప‌దవి అన్న విధంగా చ‌క్రం తిప్పేందుకు బొత్స స‌హ‌కారం తీసుకుంటున్నారు. ఇదే ద‌శ‌లో జెడ్పీ పీఠం అన్న‌ది ఎవ‌రిని వ‌రిస్తుంది అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. గొర్లె బ‌ల‌ప‌రుస్తున్న అభ్య‌ర్థినికి ఇటీవ‌లే కార్పొరేష‌న్ ప‌ద‌వి ద‌క్కింది. దీంతో ఆయా వ‌ర్గాల‌కు ఆశలు స‌న్న‌గిల్లాయి. ఇప్పుడు గొర్లె ఎవ‌రు పేరును తెర‌పైకి తెస్తారో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. మ‌రో వైపు అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత పాల‌వ‌లస విక్రాంత్ (నిన్న‌మొన్న‌టి డీసీసీబీ చైర్మ‌న్‌) కుటుంబం కూడా అదృష్టం చాటుకోవాల‌ని చూస్తోంది. కానీ విక్రాంత్ చెల్లి రెడ్డి శాంతి పాత‌ప‌ట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. విక్రాంత్ కూ ప‌ద‌వి ఇచ్చారు. ఇంకా ఆ కుటుంబం నుంచి ఇప్పుడు జెడ్పీటీసీ బ‌రిలో ఉన్న ఇద్ద‌రు మ‌హిళ‌ల్లో ఎవ‌రో ఒక‌రి పేరును జెడ్పీ చైర్మ‌న్ ప‌ద‌వికి సూచించాల‌ని స్థానిక నాయ‌త్వం అంతా క‌లిసి ముఖ్య‌మంత్రి పై ఒత్తిడి తెస్తున్నారు.


జెడ్పీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇంకా తేల‌నే లేదు. అప్పుడే కుల వివాదాలు, డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా శ్రీ‌కాకుళం జిల్లాలో జెడ్పీ పీఠం గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాళింగుల‌ను వ‌రించింది. అంత‌కుమునుపు కాపు సామాజిక‌వ‌ర్గాన్ని వ‌రించింది.ఈ సారి మాత్రం పీఠం కేటాయింపుపై అప్పుడే స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. కాళింగ, కాపు సామాజిక వ‌ర్గాలే జిల్లాలో మొద‌టి నుంచి బాగా ప్ర‌భావ వంతంగా రాజ‌కీయాలు చేస్తున్నాయి. వీరి తో పాటు వెల‌మ సామాజిక‌వ‌ర్గం త‌న ప‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు నిలుపు కుంటూ వ‌స్తోంది. కాళింగులు ఎక్కువన్న చోట కూడా వెలమ సామాజిక‌వ‌ర్గం త‌న ప‌ట్టు చాటుకోవ‌డం అన్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామ‌మే. కానీ కాళింగుల‌ను కాద‌ని, త‌మ‌కు ప‌ద‌వి కేటాయించాల‌ని ఎవ్వ‌రు ప‌ట్టుబ‌ట్టినా సంబంధిత పార్టీలు చుక్క‌లు చూడాల్సిందే. ఇదేవిధంగా వెల‌మ‌లు కూడా త‌మ‌దైన ప్ర‌భావం చూపుతూనే ఉన్నారు. తాజాగా స్థానిక ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఎలా ఉన్నా శ్రీ‌కాకుళం జెడ్పీ పీఠం త‌మ సామాజిక వ‌ర్గానికే కేటాయించాల‌ని అఖిల భార‌తీయ యాద‌వ మ‌హాస‌భ డిమాండ్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మ సామాజిక వ‌ర్గానికి రాజ‌కీయంలో ప్రాధాన్యం లేద‌ని వాపోతోంది. ప‌దవుల కేటాయిం పులో ఈ సారి అయినా ము ఖ్య‌మంత్రి త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap