ఒక‌ప్ప‌టి క‌మ్యూనిస్టుల‌కూ ఇప్ప‌టి క‌మ్యూనిస్టుల‌కూ ఎంతో తేడా! భూముల విష‌య‌మై అంతా ఒక్క‌టే! పాల‌క వ‌ర్గం పీడ‌న వ‌ర్గం అని  చెప్పే క‌మ్యూనిస్టులు ఇప్పుడు జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితులు. అంతేకాదు వారు అనుకున్న ప‌నుల‌న్నీ ద‌గ్గ‌రుండి మ‌రీ! చేయించి పంపుతున్నారు అని కూడా ఓ స‌మాచారం. ఇప్పుడు నీలి గ్రానైట్ త‌వ్వ‌కాల‌పై కానీ, ఇసుక త‌వ్వ‌కాల‌పై కానీ మ‌రో అక్ర మంపై కానీ క‌మ్యూనిస్టులు మాట్లాడ‌రు. మాట్లాడినా అదంతా స‌చివాల‌యం సాక్షిగా జ‌గ‌న్ కు అనుకూల‌మే! మ‌రి! చంద్ర‌బాబు ఏం త‌ప్పు చేశాడు. ఆ రోజు వ‌ర‌ల్డ్ బ్యాంకు నుంచి అప్పు తేవ‌డ‌మే పెద్ద నేరం అని చెప్పారు.. ఇప్పుడు ప్ర‌భుత్వాలు చేస్తున్నదేం టి? అంటే ఒక్కొక్క‌రికీ ఒక్కో విధంగా క‌మ్యూనిస్టులు ఉంటారా..త‌మ‌కు అనుకూలం కాని టీడీపీ నేత‌ల‌పై ఓ విధంగా, అనుకూలం అయిన వైసీపీ పెద్ద‌ల‌పై మ‌రో విధంగా ప్రేమ చూపిస్తారా?



క‌మ్యూనిస్టుల‌కూ, జ‌గ‌న్ కూ మంచి స్నేహం ఉంది. ఇలా రాయ‌డం అంటే ఎవ్వ‌రికీ ప‌డ‌దు. కానీ ప‌డినా ప‌డ‌క‌పోయినా జ‌రిగేది ఆ గ‌దు. జర‌గబోయేదీ ఆగ‌దు. చాలా కాలం నుంచి క‌మ్యూనిస్టుల‌తో మంచి స్నేహం ఉంది జ‌గ‌న్ కు. ఆ స్నేహానికి కార‌ణం స‌జ్జ‌ల రా మ‌కృష్ణా రెడ్డి. అందుకే ఆయ‌న‌ను క‌మ్యూనిస్టు పార్టీలు పెద్ద‌గా విమ‌ర్శించ‌వు. విమ‌ర్శించినా అంత‌గా అవి పోరు బాట‌కు దిగ‌వు.




క‌మ్యూనిస్టు పార్టీలన్నీ ఇవాళ జ‌గ‌న్ కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇస్తున్న‌వే. మ‌ధు కానీ నారాయ‌ణ కానీ వీళ్లంతా జ‌గ‌న్ కు ఆత్మీయు లే! అందుకే ఇవాళ చెప్పుకోద‌గ్గ ప్ర‌జా పోరాటాలు లేవు అన్న‌ది ఓ వాస్త‌వం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో కూడా ఉనికిలో భాగంగా ఉద్య‌మాలు చేశాయే కానీ చాలా ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌డంలో ఆ రోజు త‌మ్మినేని వీర‌భ‌ద్రం(క‌మ్యూనిస్టు లీడ‌ర్) ముందున్నారు. అంతెందుకు అప్ప‌టి రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ద‌గ్గ‌ర‌కు కొన్ని ఫైళ్లు తీసుకుని పోయి, త‌న సొంతం అనుకున్న మ‌నుషుల భూము లు ఇవి అని మీరే స‌మస్య‌ను క్లియ‌ర్ చేయాల‌ని చెప్పి, త‌న ప‌ని చేయించుకుని మ‌రీ వెళ్లారు. ఇవ‌న్నీ గ‌తంలో జ‌రిగిన‌వే అయినా పాల‌కుల‌పై బ‌య‌ట‌కు తిట్టినంత సులువుగా క‌మ్యూనిస్టులు లోప‌ల ఉండ‌రు అనేందుకు ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో! ఇంకొక ఉదాహ‌ర ణ లేదా సంఘ‌ట‌న‌ను పరిశీలిస్తే.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలోనే బండ్ల గూడ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇప్ప‌టి విశాలాంధ్ర బుక్ హౌస్ గొడౌ న్ కు ఆనుకుని ఉన్న ఖాళీ ప్ర‌భుత్వ స్థ‌లాన్ని త‌మ సంస్థ (విశాలాంధ్ర ప్ర‌చుర‌ణాల‌యం) కు రాయించుకున్న ఘ‌న‌త కూడా నారా య‌ణ‌దే! ఇదే కోవ‌లో జ‌గ‌న్ కూడా ఉన్నారు. ఉంటారు కూడా! మ‌రి! బ‌య‌ట‌కు క‌నిపించేది ఏంటి? పాల‌కుల వ్య‌తిరేక‌త కానీ లోప‌ల మాత్రం పాలకుల‌తో ఎవ్వ‌రూ కోరుకోనంత స్నేహ ధ‌ర్మం.




మరింత సమాచారం తెలుసుకోండి:

ap