గ‌త ప్ర‌భుత్వంలో కోండ్రు ముర‌ళి, ఇప్పుడు కంబాల జోగులు ఇద్ద‌రికీ ఈ ప్రాంతం అంటే ప‌ట్ట‌దు అని తేలిపోయాక ఇక ఎవ్వ‌రిని నిల‌దీయాలి? ఎవ‌రిని నిందించాలి?  


చిన్న చిన్న సాగునీటి వ‌న‌రుల‌ను కూడా వినియోగంలోకి తీసుకు రాలేని అస‌మ‌ర్థ‌త‌లో వైసీపీ ప్ర‌భుత్వం ఉంది అనేందుకు తా ర్కాణాలు ఎన్నో! కొద్దిపాటి దృష్టిసారిస్తే ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి ప‌నులు చేయిస్తే ఎంతో మంది రైతాంగం జ‌గ‌న్ ను త‌మ గుండెల్లో దాచుకుంటారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి స్థాయిలో మ‌డ్డువ‌ల‌స‌కు కానీ, వంశ‌ధార ప్రాజెక్టుకు కానీ, జంఝావ‌తి ప్రాజెక్టుకు కానీ నిధులు ఇచ్చే స‌త్తా ఈ ప్ర‌భుత్వానికి లేద‌ని తేలిపోయింద‌ని అయిన‌ప్ప‌టికీ త‌మ‌లో ఆశ చావ‌డం లేద‌ని, అందుకే స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల ను తాము క‌లిసి గోడు వినిపించుకుంటున్నామ‌ని ఇక్క‌డి రైతులు ఆవేద‌న చెందుతున్నారు. కాలువ బాగ‌యితే త‌మ పంట‌ల‌కు నీరు వ‌స్తుంద‌ని, కాలువ బాగుప‌డితే త‌మ కష్టాలు తీరిపోతాయ‌ని, ముఖ్యంగా ష‌ట్ట‌ర్ల‌ను బాగు చేస్తే స‌మ‌స్య పరిష్కారం అవుతుం ద‌ని, వ‌ర‌ద నీరు పొలాల్లోకి చేరేందుకు అవ‌కాశ‌మే అప్పుడు ఉండ‌ద‌ని, ఇవేవీ కాకుండా ప‌ట్టింపే లేని విధంగా స్థానిక నాయకులు ఉన్నార‌ని వేద‌న చెందుతున్నారు.


శ్రీ‌కాకుళం జిల్లా రేగిడి మండ‌లంకు చెందిన వార్త ఇది. ఈ ప్రాంతంలో సాయ‌న్న కాలువ ఆధునికీక‌ర‌ణ జ‌ర‌గ‌క ఏళ్ల త‌ర‌బ‌డి ఆయ‌క ట్టుకు నీరు అంద‌క రైతులు అవ‌స్థ‌లు పడుతున్నారు. ప‌దివేల ఎక‌రాల‌కు నీరు అందించి, ఇక్క‌డి  రైతుల‌కు అండ‌గా నిలిచే ఈ కా లువ ప‌నుల‌కు అధికారులు ముందుకు వ‌చ్చినా, ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డం లేదు. నాలుగు కోట్ల రూపాయ‌లు మంజూరు చేస్తే కాలువ ఆధునికీక‌ర‌ణ ప‌నులు సాధ్యం. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ పాటి మొత్తాల‌ను కూడా విడుద‌ల చేయ‌లేని ద‌య‌నీయ స్థితిలో ఉంది. కాలువ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అవుతోంద‌ని, ష‌ట్ట‌ర్లు పాడ‌యిపోయాయ‌ని ఎన్ని సార్లు అధికారుల ద‌గ్గ‌ర రైతులు మొర‌పెట్టుకుం టున్నా ఫ‌లితం లేకుండా పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap