జ‌గ‌న్ అనుకున్న‌దే చేస్తాడు. సీనియ‌ర్ల‌ను పూర్తిగా ఇంటికే ప‌రిమితం అయ్యేలా త‌న ప్ర‌వ‌ర్త‌న తీరును కొన‌సాగిస్తాడు. దీంతో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ నాయ‌కుల వెతుకులాట‌కు త‌న‌కూ మార్గం సులువు అవుతుంద‌ని భావిస్తున్నాడు. అందుకే చాలా కాలం నుంచి సీనియ‌ర్ల‌కు వాల్యూ లేదు. అలా అని అనీల్ లాంటి జూనియ‌ర్ మంత్రుల‌కు ఏమ‌యినా విలువ ఉందా అంటే అదీ లేదు. అతి చేసినా, విప‌రీతం అయిన స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శించినా జ‌గ‌న్ ఒప్పుకోడు. ఇన్నీ ఉన్నాక ఇక ఆయ‌న గురించి ప్ర‌త్యేకించి చెప్పేదేంట‌ని?



ధ‌ర్మాన‌, బొత్స‌, ఆనం ఇలా సీనియ‌ర్లంతా అస్స‌లు జ‌గ‌న్ ప‌రిగ‌ణ‌న‌లో లేని వ్య‌క్తులుగా ఎందుకు ఉండిపోతున్నారు. జ‌గ‌న్ చెప్పిం దే వేదం అయితే మిగ‌తా మంత్రి వ‌ర్గం ఎందుకు. నెల్లూరు మొద‌లుకుని శ్రీ‌కాకుళం వ‌ర‌కూ ఉన్న ఈ అసంతృప్తే జ‌గ‌న్ కొంప ముం చనుందా? ఇన్ని ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల కార‌ణంగా జ‌గ‌న్ సాధించేది ఏమిటి? ఇవీ ఇవాళ్టి ప్ర‌శ్న‌లు. వీటిపై ఎటువంటి స‌మాధానాలు జ‌గ‌న్ ఇచ్చినా ఇవే నిజాలు. అస్స‌లు క్యాబినెట్ నిర్ణ‌యం అంటే జ‌గ‌న్ నిర్ణ‌య‌మే. ఇదే ఒకింత ఇబ్బంది. సీనియ‌ర్లు ఎవ్వ‌రికీ పా ర్టీలో ప్రా ధాన్యం ఇవ్వ‌కుండా అన్నీ తానే అంతా తానే అయి ఉంటే, ఇక తాము ఉండి, జిల్లాల‌లో పార్టీ బ‌లోపేతానికి కృషి చేసి లాభ మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మీరు న‌చ్చితే ఉండండి, లేదంటే వెళ్లిపోండి..అన్న రీతిలో కూడా జ‌గ‌న్ కొన్ని సార్లు మాట్లాడార‌ని కూడా తెలుస్తోంది.


ఇదే ధోర‌ణి కార‌ణంగానే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటి సీనియ‌ర్లు సైలెంట్ అయిపోతున్నారు. సె క్ర‌టేరియ ట్ లో గతంలో మాదిరిగా మంత్రుల మాట‌కు విలువే లేద‌ని, సీఎంఓ క‌న్ఫ‌ర్మేష‌న్ లేనిదే ఏ ప‌నులూ అవ్వ‌డం లేద‌ని స మాచారం. దీంతో విసుగెత్తిపోయిన బొత్స కొంత కాలం జ‌గ‌న్ కు ట‌చ్ లో లేకుండా పోయార‌ని కూడా సమాచారం. పేరు మంత్రి వ ర్గం పెత్త‌నం జ‌గ‌న్ దే అయితే, ఇక్క‌డ తాముండి కూడా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ వారికి ఏమీ చెప్పుకోలేని ద‌య‌నీయ స్థితిలో ఉ న్నామ‌ని మంత్రులు ఆవేద‌న చెందుతున్నారు.



కొందరు మంత్రులు అయితే పీఎస్ ల ఆగ‌డాల‌ను నియంత్రించ‌లేక త‌లలు ప‌ట్టు కుంటే, మ‌రొకొంద‌రు ఆ కార‌ణంగా రేగిన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోప‌ణ‌లు వ‌స్తే మంత్రుల‌పై జ‌గ‌న్ అంద‌రి ఎదుటా సీరియ‌స్ అవుతున్నారు. వ్య‌క్తిగ‌తంగా చెప్పి చూసే ధోర‌ణే లేదు. జిల్లాలలో వీరి పొజిష‌న్ తెలుసుకుని వెంట‌వెంట‌నే త‌న మ‌నుషుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. దీంతో మంత్రుల మాట కాదు క‌దా!క‌నీసం క‌ద‌లికకు కూడా విలువ లేకుండా పోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap