నెల్లూరు జిల్లాలో నేను నా కార్య‌క‌ర్త పేరిట ఎమ్మెల్యే, జ‌గ‌న్ వీర విధేయుడు అయిన కోటం రెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి స్థానికంగా ప‌ర్య‌టిస్తూ, ప్ర జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం అన్న‌ది తాను ఎంచుకున్న ప‌ద్ధ‌తి. అయితే 18 వ డివిజ‌న్ హ‌ర‌నాథ పురంలో ఆయ‌న‌కు ఊహిం చ ని అనుభ‌వం ఎదురైంది. ఇక్క‌డ ఎదుర్కొంటున్న స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిచ‌డం ఇప్ప‌టికిప్పుడు సాధ్యం కాద‌ని త‌న వ‌ద్ద‌కు వ చ్చిన అర్జీదారుల‌కు చెప్పేశారు. నిధులు వ‌స్తేనే ప‌నులు కానీ, తాను మాట‌లు చెప్ప‌ను చెప్పి కాల‌యాప‌న చేయ‌ను అని కూడా తే ల్చేశారు.

అధికారంలోకి వ‌చ్చాక ఏం చేసినా, చేయ‌క‌పోయినా ఆ రోజు ఇచ్చిన వాగ్ధానాల ఊసు ఒక సారి త‌లిస్తే చాలు. వాటి కోసం ఏం చేయాలా అన్న ఆలోచ‌న కానీ ప్ర‌తిపాద‌న కానీ చేస్తే ఇంకా మేలు. ఈ రెండూ గౌర‌వ ముఖ్య‌మంత్రి చేయ‌లేక‌పోతున్నార‌న్న‌ది నిర్వివాదాంశం. పాద‌యాత్ర‌లో తాహ‌త‌కు మించి సంక్షేమ ప‌థ‌కాలు ఎనౌన్స్ చేసిన జ‌గ‌న్ ఇప్పుడు వాటికి నిధులు స‌మ‌కూ ర్చుకోలేక, ఇటు ప్ర‌జ‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు కోరుతున్న నిధుల విడుద‌లపై సాహ‌సోపేతం అయిన నిర్ణ‌యం ఏదీ తీసుకోలేక జ‌గ‌న్ ముందు క‌న్నా ఇప్పుడే జ‌నం ద‌గ్గ‌ర పూర్తిగా చ‌తికిల‌పడ్డారు. దీంతో ఎమ్మెల్యేలు అంతా చిక్కుల్లో ప‌డుతున్నారు. తాము ఎక్క‌డి నుంచి నిధులు తేవాలి అన్న ప్ర‌శ్న ఒక‌టి వారిని వెన్నాడుతోంది. వేధిస్తోంది. చిన్న చిన్న ప‌నుల‌కు కూడా నిధులు లేవు అని చెప్పాల్సిరావ‌డ‌మే ఇప్ప‌టి ఎమ్మెల్యేల ద‌య‌నీయ స్థితికి తార్కాణం.

చెప్పాడంటే చేస్తాడంతే అన్న‌ది జ‌గ‌న్ పార్టీ నినాదం. కానీ ఆయన  చెప్పాక కూడా చేయ‌ని ప‌నులు ఎన్నో! ముందుగా నిధుల కొర త కార‌ణంగా ఆయ‌నేమీ చేయ‌లేక‌పోతున్నాన‌ని చెబితే బాగుండు. ఆ మాట కూడా ఎక్క‌డ చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు.


దీంతో వైసీపీ ప్ర‌భుత్వానికి చెందిన పెద్ద మ‌నుషులు, జ‌గ‌న్ విధేయులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏం చేస్తే జనాల‌కు జ‌వాబు చెప్ప‌గ‌లం అన్న‌ది పాలుపోక రాజ‌కీయ రంగానికి గుడ్ బై చెప్పేస్తే బెట‌ర్ అన్న ఆలోచ‌న‌ల‌కూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే సీనియ‌ర్లంతా ఇదే ఆలో చ‌న‌ల‌తో ఉన్నార‌న్న‌ది సుస్ప‌ష్టం. నేనేం చేయాలో చెప్పండి డ‌బ్బుల్లేవు..మీరే అర్థం చేసుకోవాలి..అని ఓ జ‌గ‌న్ విధేయుడు ప్ర‌జ ల‌ను మొర‌పెట్టుకున్నారు. ఇదీ నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి ఎదుర్కొంటున్న కాదు కాదు ఎదురీదుతున్న స‌మ స్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap