పోటీ పడ్డారు... పదవి కోసం పాకులాడారు... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నించారు. ఎప్పుడో గతేడాది జరగాల్సిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కోర్టు కేసుల మధ్య సాగుతూ సాగుతూ వచ్చిన ఈ ప్రక్రియ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత... ఆయన స్థానంలో నీలం సాహ్నీని జగన్ సర్కార్ నియమించింది. ఆమె పదవి స్వీకరించిన వెంటనే... ఫస్ట్ చేసిన పని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పాత ఫైల్ దుమ్ము దులిపారు. పదవిలోకి వచ్చిన పది రోజుల్లోపే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసేశారు.

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం.. తప్పుబట్టి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలు నిర్వహించేందుకు కనీసం నాలుగు నెలల సమయం ఉండాలనే నియమాన్ని పాటించలేదని... హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్నికలు నిర్వహించండి... కానీ ఫలితం ఆపాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో... ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఓటింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం. ఆ తర్వాత దాదాపు 5 నెలల పాటు హైకోర్టులోనే విచారణ కొనసాగింది. ఫలితాలు ఇవ్వాలా వద్దా అనే అంశంపై. సుదీర్ఘ విచారణ అనంతరం... ఫలితాలు వెల్లువరించాలని కోర్టు తీర్పు వెలువరిచింది. అప్పటి వరకు ఈ బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్‌ల్లోనే స్టోర్ చేశారు.

సరిగ్గా 5 నెలల తర్వాత స్ట్రాంగ్ రూమ్ తాళాలు తీయడంతో... ఇప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల స్ట్రాంగ్ రూమ్‌ల్లోకి నీళ్లు చేరాయి అవి కాస్తా బ్యాలెట్ పేపర్లను తడిపేశాయి కూడా. ఇక కొన్ని చోట్ల అయితే బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టి పాడయ్యాయి కూడా. ఇప్పుడు ఆ ఓట్లను ఏం చేయాలనేది అధికారులకు అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి ఆ ఓట్లు ఇక చెల్లవు. ఆ గ్రామాల్లో మళ్లీ ఓటింగ్ నిర్వహించాల్సిందే. మరి పోలింగ్ ప్రక్రియ ఎప్పుడో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: