ఆఫ్ఘన్ ఆక్రమణ అనంతరం పాక్ సరిహద్దులలో చొరబాటుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎప్పుడెప్పుడు భారత్ లో రక్తపాతాన్ని సృష్టించాలని ఆరాటపడుతుంది. తాజాగా సరిహద్దుకు అతిదగ్గరగా ఉన్న జలాలాబాద్ లో బైక్ పేలుడు సంభవించింది. అది తీవ్రవాద చర్య అని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసినట్టు చెపుతున్నారు అధికారులు. అతడిని విచారించగా, బైక్ బాంబు ద్వారా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలుస్తుంది. ప్రజలు గుంపులుగా ఉన్న చోట ఈ బైక్ పార్క్ చేసి దానిని పేల్చడం ద్వారా వీరి ప్రణాలికను అమలు చేసేందుకు సిద్ధం అయ్యారని తెలిసింది. అయితే ఈ బైక్ మార్గమధ్యంలోనే పేలుడుగు గురి కావడంతో బల్విందర్ సింగ్ అనే యువకుడు మృతి చెందినట్టు నిర్దారించారు అధికారులు.

అదుపులో ఉన్న యువకుడు చెప్పిన దాని ప్రకారం బల్విందర్ సింగ్ ఆ బైక్ బాంబును మనుషుల సంచారం ఎక్కువ ఉన్న చోట  పార్కింగ్ కోసం చూస్తున్నట్టు, దీనికి దగ్గరలో ఉన్న గ్రామంలో రచన చేసినట్టు తెలిసింది. అదే గ్రామానికి చెందిన గురు ప్రీత్ సింగ్ కూడా ఈ ప్రణాళికలో భాగస్వామిగా ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసుల కధనం ప్రకారం బల్విందర్ సింగ్ సహా నలుగురికి ఈ ఘటనతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. వీరిని అధికారులు అదుపులోకి తీసుకోని విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. 14న వీరందరూ పేలుళ్లకు రచన చేయగా, 15న బైక్ ను పేల్చినట్టు తెలిపారు అధికారులు.

అలాగే ఆ గ్రామంలో ఉన్న రైతు సమాచారం మేరకు వీరు దాచిన టిఫిన్ బాంబ్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతనెల 8న అమృత్ సర్ పోలీసులు లోపాక్ లోని దలేకే గ్రామం నుండి ఐదు హ్యాండ్ గ్రనేడ్లు, టిఫిన్ బాంబు, స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే 20 న కపుర్తల పోలీసులు ఫగ్వారా నుండి హ్యాండ్ గ్రనేడ్లు, పేలుడు పదార్దాలు స్వాధీనం చేసుకున్నారు. అజాల్నల్ లో 8న ఒక ఆయిల్ టాంకర్ ను పేల్చేందుకు టిఫిన్ బాంబు వినియోగించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇవన్నీ తాజాగా పాక్ సరిహద్దులలో చొరబాటు కోసం చేస్తున్న పనులని స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండటం వలన ఆయా ఘటనలలో బాంబు పేలుళ్లు జరగకుండా ఆపగలిగారు. అయినా పాక్ ఆగకుండా ఒకదాని తరువాత మరొకటి ప్రయత్నాలు చేస్తూ పోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: