ప్రస్తుతం వ్యాక్సినేషన్ విషయంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతూ ప్రస్తుతం దూసుకుపోతుంది భారత్.  కరోనా వైరస్ సంక్షోభం సమయంలో భారత్ లాంటి వెనుకబడిన దేశాలు ఇతర దేశాలపై వ్యాక్సిన్ విషయంలో ఆధారపడుతాయని అందరు అనుకున్నారు  కానీ ఇతర దేశాలపై ఆధారపడటం కాదు ఏకంగా ఇతర దేశాలే భారత్ పై వ్యాక్సిన్ కోసం ఆధారపడే విధంగా అద్భుతమైన ప్రణాళికతో ముందుకు సాగింది  ప్రస్తుతం భారత్లో దాదాపుగా రెండు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగంలో ఉన్నాయ్.  ఇలా సొంత వ్యాక్సిన్లను ఉపయోగించడమే కాదు ఇతర దేశాలకు సైతం భారత వ్యాక్సిన్లను సహాయం చేసి గొప్ప మనసు చాటుకుంది. ఇక ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంతో వేగంగా కొనసాగిస్తూ దూసుకుపోతుంది భారత్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి. ఇక ఇప్పుడు వాక్సినేషన్ విషయంలో అటు అగ్రరాజ్యమైన అమెరికా ని సైతం దాటి వేయడమే కాదు అమెరికా కంటే రెండు రెట్లు ఎక్కువగా వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది భారత్. అమెరికా దేశ పూర్తి జనాభా 34 కోట్లు.  ఇక భారత్లో వ్యాక్సినేషన్ పూర్తయిన వారి సంఖ్య 79 కోట్లు. అంటే అమెరికా జనాభా తో పోల్చి చూస్తే భారత్ టీకా ప్రక్రియను 2రెట్లు ఎక్కువగా పూర్తిచేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లను వేసింది భారత్. సింగపూర్ లాంటి ఒక చిన్న దేశపు పూర్తి జనాభా తో పోల్చుకుంటే భారత్ ఒక్క రోజులో వ్యాక్సినేషన్ పూర్తి చేసింది ఎక్కువ అని చెప్పాలి. ఏకంగా రెండు కోట్లకు పైగా వ్యాక్సిన్లు ఒక్కరోజులోనే వేశారు దేశవ్యాప్తంగా. ఇక అక్టోబర్ నాటికి వంద కోట్ల వ్యాక్సిన్లను పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ప్రస్తుత భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  దీని కోసం అన్ని విధాలుగా కృషి చేస్తోంది భారత ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: