ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇప్పుడిప్పుడే వెలువ‌డు తున్నాయి. గతేడాది నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్ప‌ట‌కి ఈ ఎన్నిక‌లు క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. ఇక నీలం సాహ్నీ వ‌చ్చిన వెంట‌నే ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే దీనిపై కోర్టుకు వెళ్ల‌డంతో పాటు అనేక వాదోప‌వాదాలు జ‌రిగాయి. దాదాపు సంవ‌త్స‌రంన్న‌ర పాటు ఊరించి ఊరించి వ‌స్తోన్న ఈ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ప్ర‌హ‌స‌నం ఎట్ట‌కేల‌కు ఈ రోజుతో ముగుస్తోంది. హైకోర్టు ఈ ఓట్ల లెక్కింపును ఈ రోజు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఈ రోజు ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని జ‌డ్పీటీసీ లు, ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలోనే వైసీపీ అనేక చోట్ల ఏక‌ప‌క్ష విజ‌యాలు సాధిస్తున్నా కూడా కొన్ని చోట్ల మాత్రం అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. విచిత్రం ఏంటంటే వైసీపీ చాలా బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా టీడీపీ అనూహ్యంగా ఒక‌టి రెండు స్ధానాల్లో విజ‌యం సాధిస్తోంది. ఈ క్ర‌మంలోనే వైసీపీ కంచుకోట అయిన క‌ర్నూలు జిల్లాలో టీడీపీ అనూహ్యంగా ఓ ఎంపీటీ సీ స్థానా న్ని కైవ‌సం చేసుకుం ది.

కోడుమూరు మండలం వెంకటగిరి ఎంపీటీసీ స్ధానాన్ని టీడీపీ కైవసం చేసుకోవ‌డంతో అక్క‌డ టీడీపీ నేత‌ల ఆనందా ల‌కు అవ‌ధులే లేకుండా పోయాయి. ఇక్క‌డ నాలుగు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి సుజాత వైసీపీ అభ్యర్థిపై సంచ‌ల‌న విజ‌యం సాధించారు. దీంతో వైసీపీ అభ్యర్థి ఓటమిని అంగీకరించలేదు. తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం వైసీపీ వాళ్లు రీ కౌంటింగ్‌కు పట్టుబట్టారు. ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ నిర్వహించగా మ‌ళ్లీ టీడీపీయే అక్క‌డ విజ‌యం సాధించింది.

అయితే ముందు అక్క‌డ టీడీపీ నాలుగు ఓట్ల‌తో గెలిచింది. రీ కౌంటింగ్ లో రెండు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై సుజాత విజయం సాధించారని అధికారులు వెల్లడించారు. ఇక కోడుమూరు పంచాయ‌తీని కూడా గ‌త స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ తిరుగులేని మెజార్టీతో ద‌క్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: