ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల క్రితం జ‌రిగిన ఫ‌లితాలు ఈ రోజు వెల్ల‌డి అవుతున్నాయి. టీడీపీ ముందే ఈ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించింది. అయినా ఈ రోజు వెల్ల‌డి అవుతోన్న ఫ‌లితాల్లో కొన్ని చోట్ల టీడీపీ గట్టి పోటీ ఇవ్వ‌డంతో పాటు భారీగా ఓట్లు ద‌క్కించుకుంది. గోదావ‌రి జిల్లాల‌లో జ‌న‌సేన‌, టీడీపీ చాలా చోట్ల మెరుగైన ఓట్లు సాధించాయి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టీడీపీ ఇప్ప‌టికే 10 ఎంపీటీసీల‌లో విజ‌యం సాధించింది. వైసీపీ ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం అక్క‌డ 100 ఎంపీటీసీలు కైవ‌సం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ 10 ఎం పీ టీసీ ల‌లో విజ‌యం సాధించింది.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే జ‌న‌సేన బ‌లంగా ఉన్న చోట్ల ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్య‌ర్థులు కూడా వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం జ‌న‌సేన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 4 ఎంపీ టీసీ స్థానాల లో విజ‌యం సాధించింది. ఒక ఇక్క‌డ ఒక ఇంటి పెండెంట్ విజ‌యం సాధించారు. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని డెల్టా ప్రాంతంలోనూ.. కాపు సామాజిక వ‌ర్గ ఓటర్లు ఎక్కువుగా ఉన్న చోట్ల ఆ పార్టీ మంచి ఓట్లు సాధించింది.

ఇక గ‌త 2019 లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జిల్లా మొత్తం మీద వైసీపీ దూసుకు పోయింది. ఈ ఎన్నిక‌ల‌లో టీడీపీ కేవ‌లం పాల‌కొల్లు, ఉండి స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది. ఇక గ‌త స‌మ్మ‌ర్ లో జ‌రిగిన మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో సైతం వైసీపీ తిరుగులేని విజ‌యాలు సాధించింది. ఇక స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌లో మాత్రం టీడీపీ కొన్ని చోట్ల పుంజుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను టీడీపీ ముందుగానే బ‌హిష్క రించిన ప్ప‌ట‌కి కూడా ఆ పార్టీ చెప్పుకోద‌గ్గ విజ‌యాలు సాధించ‌డం పార్టీ వ‌ర్గాల‌లో ఆనందం క‌లిగిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: