బ‌తుకూ, చావు అనే రెండు కొనల మ‌ధ్య జీవితం ఏంట‌న్న‌ది తేలిపోవ‌డం పెద్ద క‌ష్ట‌మ‌యిన ప‌ని కాదు. ఆయ‌న గెలిచారు అని చెప్ప డం అధికారుల‌కో ప్ర‌త్యేక సంద‌ర్భం. కానీ ఆయ‌న లేరు. చ‌నిపోయారు. స్థానిక పోరులో పోటీచేసిన ఆ వ్య‌క్తి అకాల మ‌ర‌ణం చెందినా బ్యాలెట్ వార్ లో  నెగ్గి, త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటి, స్ఫూర్తిగా నిలిచారు. ప‌శ్చిమ‌గోదావ‌రి వాకిట చోటుచేసుకున్న ఈ ప‌రిణామంతో అధికారులే కాదు నాయ‌కులూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.



చావును జ‌యించిన దాఖ‌లాలు ఏమీ లేవు. చ‌చ్చాక సాధించ‌డం అన్న‌ది ఎన్నో సార్లు జ‌ర‌గ‌ని ప‌ని. చ‌చ్చి బ‌త‌క‌డం అన్న‌ది కూడా కుద‌ర‌ని ప‌ని. కానీ ఆయ‌న మృత్యువు త‌న‌ను తీసుకుపోయినా, మృత్యువును జ‌యిం చ‌లేక‌పోయినా ప్ర‌జా పోరులో జన హృద యాల‌ను గెలిచారు. అవును ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో తాళ్ల‌పూడి మండ‌లంలో్ జ‌రిగిన ఘ‌ట‌న ఇది. అస‌లు ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఇంత‌వ‌ర‌కూ చోటు చేసుకుని ప‌రిణామం. అరుదైన ప‌రిణామం అని రాయాలి.



ఇప్పుడా కుటుంబంలో ఆనందం నెల‌కొంది. మ‌నిషి లేక‌పోయినా ప్ర‌జా మ‌న్న‌న అన్న‌ది ఆయ‌న సాధించిన గొప్ప విజ‌యం. చ‌చ్చి బ‌త‌క‌డం అన్ని సార్లూ సాధ్యం కాదు. గెలుపు శిఖ‌రంగా మార‌డం అన్ని వేళ‌లా కుద‌ర‌దు కానీ  ఆయ‌న సాధించాడు. గెలిచాడు. ప్ర‌జా పోరులో బ్యాలెట్ వార్ లో గెలిచి గోదావ‌రి తీరాల్లో ఓ అరుదైన పేజీ త‌న‌కంటూ రాసే అర్హ‌త ను సాధించాడు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

 
జీవితాన్ని జ‌యించండి.. సాధ్యమా! కాక‌పోవ‌చ్చు. కాక‌లుతీరిన యోధులు ఎందరో! రాజ‌కీయాల‌ను జ‌యించండి.. సాధ్య‌మా? ఓడి గెలిచిన నాయ‌కులెందరో? ఇప్పుడు ఓ పెద్దాయ‌న జీవితాన్ని అర్ధంత‌రంగా ముగించాడు కానీ ఎన్నిక‌ల ర‌ణ క్షేత్రంలో తిరుగులేని యోధుడిగా నిలిచాడు. తాళ్ళపూడి మండలం, వేగేశ్వరపురం - 2  ఎంపీటీసీగా కొమ్మిరెడ్డి రెడ్డి వెంకటేశ్వరావు గెలుపు సాధించారు.ఆయ‌న ఇటీవ‌లే మృతి చెందారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap