ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ను పూర్తిగా బ‌హిష్క‌రించేసి... ఎన్నిక‌ల‌ను పూర్తిగా ప‌ట్టించుకోక పోయినా కూడా టీడీపీ కొన్ని చోట్ల సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేస్తోంది. విచిత్రం ఏంటంటే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు తో పాటు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కుప్పంలోనూ వైసీపీ దూసుకు పోతోంది. అయితే ఇదే జిల్లాలో కొన్ని చోట్ల టీడీపీ విజ‌యాలు న‌మోదు చేయ‌డం టీడీపీకి బిగ్ రిలీఫ్ ఇచ్చిన‌ట్ల‌య్యింది.

ఏపీలో వైసీపీ వేవ్ ఇంత‌లా ఉన్నా... ఈ వైసీపీ హవాలో కూడా టీడీపీ నేతలు విజయాలు సాధిస్తు అంద‌రికి షాక్ ఇస్తున్నారు. కుప్పంలో నియోజ‌క‌వ‌ర్గంలోని చంద్ర‌బాబు స్వ‌గ్రామం నారావారి ప‌ల్లెలో సైతం వైసీపీ విజ‌యం సాధించింది. అయితే జిల్లాలో కుప్పం నియోజ‌క‌వ‌ర్గంతో పాటు కొన్ని చోట్ల మాత్రం టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.  కుప్పం నియోజకవర్గంలో పలు చోట్లు టీడీపీ అభ్యర్థులు సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేశారు.

బంగానత్తం ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులు 232 ఓట్లతో గెల‌వ‌గా... కంగుంది-2 ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి మోహన్ 80 ఓట్లతో విజయం న‌మోదు చేసుకున్నారు. అలాగే కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని  శాంతిపురం సి.బండపల్లె ఎంపీటీసీ స్థానంతో పాటు కుప్పం మండలం కొట్టలూరులో టీడీపీ క్యాండెట్ సి.సుబ్రయంణ్యం 85 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఇదే జిల్లాలోని  మదనపల్లె మండలం కొత్తపల్లె టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి దేవేంద్ర 148 ఓట్లతో గెలిచారు.

ఏదేమైనా టీడీపీ ఈ ఎన్నిక‌ల‌ను పూర్తిగా బ‌హిష్క రించాక కూడా ప‌లు చోట్ల ఈ స్థాయిలో విజ‌యాలు న‌మోదు చేయ‌డం గ్రేటే.. ఇక వైసీపీ కంచుకోట లాంటి చిత్తూరు జిల్లాలో ఈ స్థాయిలో విజ‌యాలు న‌మోదు అవుతున్నాయంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి. ఇక ఈ ఎన్నిక‌ల‌ను టీడీపీ పూర్తిగా వదిలి వేయ‌డంతో కేవ‌లం 61 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదు అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: