జ‌గ‌న్ ఆశించిన స్థాయి క‌న్నా ఎక్కువే అన్నింటా అందుకుంటున్నారు. ఒక విధంగా చంద్ర‌బాబు వైఫ‌ల్యం కార‌ణంగా జ‌గ‌న్ నెగ్గుకు వ‌స్తున్నారు కానీ ఆయ‌న ప్ర‌త్యేకించి సాధించింది ఆ రోజూ లేదు ఈ రోజూ లేదు. ఎందుక‌నో చంద్ర‌బాబు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. అలా అని త‌ప్పుకోనూ లేరు. ఈ కార‌ణాలే జ‌గ‌న్ ను హీరో చేస్తున్నాయి. కానీ స్థానికంగా ఉన్న విజ‌యాలు పెద్ద‌వి అయినా కూడా అవేవీ రేప‌టి వేళ ముందస్తును ప్ర‌భావితం చేస్తాయా అంటే చెప్ప‌లేం. ప్ర‌శాంత్ కిశోర్ లాంటి వ్య‌క్తుల‌ను న‌మ్ముకుని జ‌గ‌న్ ముందుకు పోతే మాత్రం మ‌రో చంద్ర‌బాబు మాదిరి యువ ముఖ్య‌మంత్రి న‌ట్టేటా మునిగి పోవడం ఖాయం. అందుకే వేడుక‌లు క‌రోనా  పేరిట వైసీపీ వ‌ద్ద‌నుకుంటోందేమో! స్థానిక మైకులూ మూగ‌బోయాయి ఇందుకేనేమో!


సాధారణంగా ఎన్నిక‌లంటే వేడి వాడి ఉంటుంది. ఫ‌లితాలు అంటే ఉత్కంఠ ఉంటుంది కానీ ఇవ‌న్నీ ఊహ‌ల‌కు అతీతంగా ఉన్న ఫ‌లితాలు అయితే కావు. ముందు నుంచి ఊహించ‌న‌వే క‌నుక జిల్లాల్లోనూ వైసీపీ శ్రేణులు సంబ‌రాల‌కు ఇది సమ‌యం కాద‌న్న విధంగానే భావిస్తుంది. ఎందుకంటే ఎన్నిక స‌రే కానీ ప‌నులు చేప‌ట్ట‌క‌పోతే ప‌రువు పోతుంద‌న్న భ‌యం అంద‌రిలోనూ ఉంది. ఇన్నాళ్లూ ఫ‌లితాలు వెల్ల‌డి కానుందున అడిగే వారు పెద్ద‌గా ఉండ‌క‌పోయినా ఇప్పుడు స్థానికంగా బాగా ప‌రిచ‌యం ఉన్న‌వారికే ప‌ద‌వులు వ‌రించి ఉంటాయి క‌నుక వారిని అంద‌రి ఎదుటే నిల‌దీసేందుకు సైతం జ‌నం వెనుకంజ వేయ‌రు. ముఖ్యంగా రోడ్ల స‌మ‌స్య‌, తాగు, సాగు నీటి స‌మ‌స్య‌లే ప్ర‌ధాన అజెండాగా ప్ర‌జ‌లు కొత్త పాల‌కుల‌ను అడుగుతారు. ప‌నులు చేయ‌క‌పోతే నిల‌దీస్తారు. వీటిని దృష్టిలో ఉంచుకునో మరెందుకో కానీ వైసీపీ అంత‌గా వేడుక‌లకు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు.
 
స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు (జెడ్పీటీసీ,ఎంపీటీసీ) రావ‌డం లేటు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తాయి అనుకున్న మీడియాలు అన్నీ పెద్ద‌గా  హ‌డావుడి చేయ‌డం లేదు. గ్రామ‌ స్థాయి లో కూడా పెద్ద‌గా సంద‌డి లేదు. క‌రోనా నియ‌మ నిబంధ‌న‌ల అమ‌లు కార‌ణంగా విజ‌యో త్స‌వ ర్యాలీలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చే సింది. దీంతో గ్రామాలు మూగ‌నోము ప‌ట్టాయి.

మ‌రోవైపు స్థానిక మీడియా కూడా పెద్ద‌గా సంద‌డి చేయ‌డం లేదు బహుశా! ఎన్నిక ఏక‌ప‌క్షం అని తేలిపోవ‌డంతో మ‌న‌కెందుకులే అని భావిస్తున్నారేమో! ఎన్న‌డూ లేనంత‌గా వైసీపీ ఆశించిన స్థాయి క‌న్నా ఎక్కువ‌గా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల‌ను త‌న ఖాతా లో వేసుకుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం ఇలాకాలో అనూహ్యంగా రాణించింది. అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా ఆశించిన స్థాయిలో ఆనందాలు లేవు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap