ఏపీలో అధికార వైసీపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఫ‌లితాల్లో దూసుకు పోతోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో టిక్కెట్లు రాని నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ముందు నుంచి వైఎస్ ఫ్యామిలీని, జ‌గ‌న్ ఫ్యామిలీని న‌మ్ముకున్న నేత‌ల‌కు ప‌ద‌వులు వ‌స్తున్నాయి. ప్ర‌కాశం జిల్లాలోని బూచేప‌ల్లి ఫ్యామిలీ ముందు నుంచి జ‌గ‌న్ వెంటే న‌డిచింది. 2004 ఎన్నిక‌ల్లో కొన్ని సమీక‌ర‌ణ ల వ‌ల్ల బూచేప‌ల్లి సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ రాలేదు. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ద‌ర్శి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత వైఎస్ ప్రోత్సాహంతో ఆయ‌న కాంగ్రెస్ లోకి వ‌చ్చారు.

2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆయ‌న రెండో కుమారుడు శివ ప్ర‌సాద్ రెడ్డి చిన్న వ‌య‌స్సులోనే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై ఆయ‌న ద‌ర్శి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు శివ ప్ర‌సాద్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ రావ‌డం వెన‌క జ‌గ‌న్ రిక‌మెండేష‌న్ ఉంద‌ని అంటారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో శివ ప్ర‌సాద్ రెడ్డి ద‌ర్శిలో సిద్ధా రాఘ‌వ‌రావుపై స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని కార‌ణాల‌తో ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు.

అయితే ఆ ఎన్నిక‌ల్లో ద‌ర్శిలో పోటీ చేసిన మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ కు ఆయ‌న స‌పోర్ట్ చేయ‌డంతో మ‌ద్దిశెట్టి బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు బూచేప‌ల్లి శివ ప్ర‌సాద్ రెడ్డి పార్టీకి చేసిన సేవ‌ల‌ను గుర్తుంచు కున్న జ‌గ‌న్ ఆయ‌న త‌ల్లి బూచేప‌ల్లి వెంకాయ‌మ్మ‌కు ప్ర‌కాశం జిల్లా జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఈ రోజు ఫ‌లితాలు నామ‌మాత్రం కావ‌డంతో వెంకాయ‌మ్మ జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ కావ‌డంతో మ‌ళ్లీ శివ ప్ర‌సాద్ రెడ్డి జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌నున్నారు. గ‌తంలో ఆమె చీమ‌కుర్తి నుంచి ఎంపీపీగా ప‌నిచేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: