ఏపీలో గత రెండున్నరేళ్ళుగా ఒక ట్రెండ్ నడుస్తోంది. అది ఏపీ రాజకీయాలకు పూర్తిగా భిన్నం, గతంలో ఎపుడూ జరగని వైనం. దాంతో ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా హీటెక్కుతున్నాయి. ఒక వైపు వారు జబ్బలు చరచుకుంటూంటే మరో వైపు పెడ బొబ్బలు పెడుతున్న రాజకీయ శిబిరాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో 2019 ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించలేదు. మరీ అంత బండగా ఇంకా చెప్పాలంటే వార్ వన్ సైడ్ అన్నట్లుగా వైసీపీకి 151 సీట్లు ఇవ్వడం అంటే షాక్ లాంటిదైంది టీడీపీకి. పైగా ఆ పార్టీకి 23 సీట్లు మాత్రమే దక్కాయి. ఇక ఆ తరువాత అయినా సీన్ ఏమైనా మారిందా అంటే అసలులేదు. లోకల్ బాడీ ఎన్నికలు అయినా తిరుపతి లోక్ సభ బై పోల్ అయినా కూడా వైసీపీకి మెజారిటీ పెరుగుతోంది, అన్నీ ఏకపక్ష విజయాలు దక్కుతున్నాయి. మరి ఇది ప్రజాదరణకు ప్రతిబింబం అని వైసీపీ అంటూంటే అధికార దుర్వినియోగం, దౌర్జన్యంతోనే వైసీపీ ఇవన్నీ సాధించింది అని టీడీపీ అంటోంది.

సరే ఇంతకు ముందు అంటే 2019 ఎన్నికల ఫలితాలను కూడా టీడీపీ ఇలాగే కామెంట్ చేసింది. నాడు ఈవీఎం ల ద్వారా టీడీపీని ఓడించారని, వైసీపీ అడ్డదారిలో గెలిచింది అన్నారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలు అంటే బ్యాలెట్ పేపర్ మీదనే. మరి బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు పెట్టండి అంటూ టీడీపీ పెద్దలు నాడు సవాల్ చేశారు కూడా. అలా జరిగినా వైసీపీయే విజయం సాధించింది. కానీ ఇపుడు అదీ ఇదీ కాదు, మరోసారి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పెట్టండి అంటున్నారు అచ్చెన్నాయుడు.

మరి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీ గెలుస్తుందా. అపుడు మళ్లీ ఈవీఎంలతోనే కదా ఎన్నికలు జరుగుతాయి. మరి అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ గెలిచే చాన్స్ ని వదులుకుంటుందా. ఇక ప్రజాపక్షం ఎవరు అన్నది కూడా చూడాలి. ప్రజలు ఎవరిని ఆదరించారు అన్నది ఎన్నికల ద్వారానే తెలుస్తుంది. దానికి మరే కొలమానాలూ లేవు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి చూస్తే ప్రజాభిప్రాయం టీడీపీకి వ్యతిరేకంగా ఉంది. టీడీపీ కూడా ఈ ఫలితాలను నమ్మమని అంటోంది. మరి ప్రజాపక్షం తామే అంటున్న టీడీపీ ఎందుకు గెలవలేకపోతోందో ఆలోచించాలి కదా. ప్రజా పక్షంగా తామున్నామని చెప్పుకుంటే కనుక టీడీపీ మరీ ఇలా వార్ వన్ సైడ్ కాకుండా కొంత వరకూ అయినా గెలవవచ్చు కదా. ఏది ఏమైనా ఏకపక్ష విజయాలతో వైసీపీ దూకుడు చేస్తూంటే ప్రజాపక్షం మాత్రం మా వైపే అంటోంది టీడీపీ. మరి అది నిజమై రుజువు కావాలంటే 2024 ఎన్నికల దాకా చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: