ఏపీలో జ‌రిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపులో వైసీపీ దూకుడు ముందు ప్ర‌తిప‌క్ష టీడీపీతో పాటు మ‌రో ప్ర‌ధాన పార్టీ అయిన జ‌న‌సేన పూర్తిగా తేలిపోయాయి. ఇక స‌మైక్య రాష్ట్రం నుంచి నేటి వ‌ర‌కు జ‌రిగిన అన్ని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను తీసుకుంటే ఈ రోజు వైసీపీ సాధించిన విజ‌యం స‌రికొత్త రికార్డుగా నిలిచింది. ఇక రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల‌లో టీడీపీ మెజార్టీ జ‌డ్పీలు గెలుచుకున్నా వైసీపీ దూకుడు ముందు మ‌రీ ఏక‌ప క్ష ఫ‌లితాలు అయితే అప్పుడు రాబ‌ట్ట‌లేదు.

2014లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో ప్ర‌కాశం - నెల్లూరు - చిత్తూరు - క‌డ‌ప - క‌ర్నూలు జ‌డ్పీ పీఠాల‌ను నాడు వైసీపీ గెలుచు కుంది. అయితే ఈ రోజు మాత్రం మొత్తం 13 జ‌డ్పీ పీఠాల‌కు 13 వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డి అయిన ఫ‌లితాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా లో 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. ఇక రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న మ‌రో జిల్లా అయిన గుంటూరు లో 54 జెడ్పీటీసీ స్థానాల్లో 39 వైఎస్సార్‌సీపీ గెలిచింది.

మిగిలిన జిల్లాల్లో ప్రకాశంలో 55 స్థానాల్లో 55 గెలిచింది. నెల్లూరు జిల్లా చ‌రిత్ర‌లో వైసీపీ అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. మొత్తం జిల్లాలో ఉన్న 46 జ‌డ్పీటీసీల‌ను గెలుచు కుంది. విశాఖపట్టణం జిల్లాలో ఉన్న‌ 39 స్థానాల్లో 32 వైఎస్సార్‌సీపీ గెలుచు కుంది. ఇక విజయనగరం లో 34 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. శ్రీకాకుళంలో 38 జెడ్పీటీసీ స్థానాల్లో 15 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

ఇక అనంతపురంలో 62 స్థానాల్లో 56 , చిత్తూరులో 65 జెడ్పీటీసీ స్థానాల్లో 43 , వైఎస్సార్‌ కడప లో  50 స్థానాల్లో 46 , కర్నూలులో 53లో 53 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. తూర్పు గోదావరిలో 61 జెడ్పీటీసీలకు మెజార్టీ వైసీపీ గెలిచింది. పశ్చిమ గోదావరిలో 48 జెడ్పీటీసీ స్థానాల్లో 30 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: