బాబు...ఇంకా మారడం బెటర్...ఎంతకాలం జగన్ మీద నిందలు వేసి సైకిల్ లాగిస్తారు. వైసీపీ అరాచకాల వల్లే ఓడిపోయామని, అసలు ఎన్నికలు బహిష్కరించామని, అందుకే వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని మిమ్మలని మీరు మోసం చేసుకుంటూ, పార్టీని మోసం చేస్తారని తెలుగు తమ్ముళ్ళు బాగానే ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు ఎలాగైనా జరగని పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. ఎప్పుడైనా ఎన్నికలు అధికారం పక్షానికే అనుకూలంగా ఉంటాయి.

అందులో ఎలాంటి అనుమానం లేదు....కాకపోతే అధికారంలో ఉన్న వైసీపీకి ఇంకాస్త ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. పైగా తమ అధికార బలాన్ని వైసీపీ చాలా బాగా ఉపయోగించుకుంది. అందుకే పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో దుమ్ము లేపింది. ఆ ఎన్నికల్లో టి‌డి‌పి దారుణంగా ఓడిపోయింది. అయితే ఇక్కడ బాబు ఓటమి ఒప్పుకోకుండా...వైసీపీ  అరాచకాల వల్లే ఓడిపోయామని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

ఇక ఇప్పుడు ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలకు ఒక సాకు ఉంది. ముందే ఎన్నికలకు నామినేషన్లు వేశారు. అంటే టి‌డి‌పి పోటీలోనే ఉంది. కానీ ఎన్నికలు జరిగే ముందు తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ ఎక్కడకక్కడ అరాచకాలు చేసి ఏకగ్రీవాలని చేసుకోవడం వల్లే తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి తమ్ముళ్ళు ఎన్నికల బరిలో దిగారు.

కానీ ఇప్పుడు దారుణంగా ఓడిపోయారు. వైసీపీ వన్‌సైడ్‌గా విజయాలు దక్కించుకుంది. ఇక తాము ఎన్నికలని పట్టించుకోలేదని, ఇది వైసీపీ పూర్తి స్థాయి గెలుపు కాదని టి‌డి‌పి నేతలు మాట్లాడుతున్నారు. అంటే తమ తప్పుల వల్ల ఓడిపోయామని చెప్పుకోకుండా నెపం వైసీపీ మీద నెట్టేందుకు టి‌డి‌పి బాగానే ప్రయత్నిస్తుంది. కానీ జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఇలా చేయలేదు...అప్పుడు ఓటములు వచ్చినా తిరిగి పోరాడారు....మళ్ళీ ఊహించని విధంగా పుంజుకుని 2019 ఎన్నికల్లో సత్తా చాటారు. కాబట్టి బాబు ఇప్పటికైనా జగన్‌ని ఫాలో అయితే బెటర్ అని, ఇకనుంచైనా నెపం వైసీపీ మీద నెట్టేయకుండా టి‌డి‌పిని పైకి లేపితే బెటర్ అని కొందరు తమ్ముళ్ళు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: