ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ వాళ్ల‌కు పెద్ద షాకులే ఇస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు తో పాటు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ టీడీపీకి దారుణ ఫ‌లితాలు వ‌చ్చాయి. ఒక బాబు స్వ‌గ్రామం అయిన నారావారిప‌ల్లెలో కూడా టీడీపీ చిత్తు గా ఓడిపోయింది. బాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీ స్థానంలో 1347 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొంద‌డం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే.

ఇక చంద్ర‌బాబు తో పాటు ఆయ‌న భార్య నారా భువ‌నేశ్వ‌రికి కూడా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓట‌రు పెద్ద షాక్ ఇచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న నిమ్మకూరులో సైతం వైసీపీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు భువ‌నేశ్వ‌రి ఈ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేశారు. అయినా స్థానిక ఎన్నిక‌ల్లో ఓట‌రు వారిని తిర‌స్క‌రించి వైసీపీకే ప‌ట్టం క‌ట్టారు. ఇలా భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రికి స్థానిక తీర్పులో ఓట‌రు పెద్ద షాకే ఇచ్చారు.

ఇదిలా ఉంటే జ‌గ‌న్ సొంత జిల్లాలోని ఓ ఎంపీటీసీ ఫ‌లితం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. కమలాపూర్‌ మండలం దేవరాజుపల్లి ఎంపీటీసీని వైసీపీ గెలుచు కుంది. అయితే ఇక్క‌డే ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉంది. ఈ ఎంపీటీసీ ప‌రిధిలో మొత్తం 191 ఓట్లు ఉండగా వై సీపీ అభ్యర్థికి ఏకంగా 186 ఓట్లు వచ్చాయి. మిగిలిన ఐదు ఓట్లు ఇండిపెండెంట్ కు ప‌డ్డాయి. ఇక్క‌డ టీడీపీ, బీజేపీల‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. దీనిని బ‌ట్టి ఇక్క‌డ ఆ పార్టీల త‌ర‌పున పోటీ చేసిన అభ్య‌ర్థులు వారి ఓటు కూడా వారు వేసుకోలేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీంతో సోష‌ల్ మీడియాలో దీనిపై పెత్త ఎత్తున ట్రోలింగ్ న‌డుస్తోంది. ఇక పూర్తి ఫ‌లితాలు ఈ అర్థ‌రాత్రికి వెలువ‌డ‌నున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: